Breaking News

ఛీ, ఒంటి మీద దుస్తుల్లేకుండా కనిపించే ఆ హీరోనా?: నటుడు ఫైర్‌

Published on Mon, 03/18/2024 - 16:45

ఇండియా ఫస్ట్‌ సూపర్‌ హీరో శక్తిమాన్‌.. ఈ సూపర్‌ హీరో పాత్రలో నటుడు ముకేశ్‌ ఖన్నా నటించాడు. నటించాడు అనడం కన్నా జీవించాడనే చెప్పాలి. అయితే కొన్నాళ్లుగా శక్తిమాన్‌ మళ్లీ రాబోతున్నాడని ప్రచారం జోరందుకుంది. అయితే ఈసారి టీవీలో కాకుండా వెండితెరపై రానుందని, బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నోరు విప్పక తప్పట్లేదు
ఈ క్రమంలో సదరు వార్తలపై ముకేశ్‌ ఖన్నా స్పందించాడు. 'రణ్‌వీర్‌ సింగ్‌ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని కొన్ని నెలలుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై చాలామంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. నేను మాత్రం సైలెంట్‌గానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఛానల్స్‌ కూడా రణ్‌వీర్‌ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని ప్రచారం మొదలుపెట్టాయో.. అ‍ప్పుడే ఇక నోరు విప్పక తప్పదని నిర్ణయించుకున్నాను. అయినా ఒంటిమీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్లు చేసే వ్యక్తి శక్తిమాన్‌గా కనిపిస్తాడా? ఇదేమైనా బాగుందా అసలు? 
 
ఎంత పెద్ద స్టార్‌ అయితే ఏంటి?
అతడు ఎంత పెద్ద స్టార్‌ అయితే ఏంటి? నేనైతే నా అభిప్రాయం చెప్పాను. ఇప్పుడేమవుతుందో చూద్దాం.. విచ్చలవిడితనం సర్వసాధారణమైన విదేశాల్లో రణ్‌వీర్‌ తనకు నచ్చిన పాత్రలు చేస్తే బాగుంటుంది. నేను నిర్మాతలతో కూడా మాట్లాడాను. శక్తిమాన్‌ అంటే సూపర్‌ హీరో మాత్రమే కాదు సూపర్‌ టీచర్‌ అని నొక్కి చెప్పాను! ఒక నటుడు ఆ పాత్ర చేస్తున్నాడంటే చక్కగా మాట్లాడగలగాలి, జనాలు అతడు చెప్తే వినగలిగేలా ఉండాలి. కొందరు హీరోలు పేరుకే పెద్ద.. కానీ వారి ఇమేజ్‌ ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది' అని సెటైర్లు వేశాడు ముకేశ్‌.

చదవండి: లైసెన్స్‌ పొందా.. దుబాయ్‌లోనే ఉంచా.. అందులో తిరుగుతుంటే మజా..

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)