Breaking News

యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!

Published on Wed, 05/15/2024 - 14:05

హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. ఈ పేరు చెబితే తెలుగు గుర్తుపట్టేస్తారు. 'సీతారామం' బ్యూటీ అంటే ఇంకా త్వరగా గుర్తుపట్టేస్తారు. చేసినవి మూడు నాలుగు సినిమాలే అయినా గోల్డెన్ లెగ్ అనిపించింది. 'ఫ్యామిలీ స్టార్' తప్పితే మిగతా రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే ఆచితూచి సినిమాలు చేస్తోంది. మరోవైపు తాజాగా ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకుని కనిపించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)

2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మృణాల్‌కి 'సీతారామం' సినిమాతో బోలెడంత గుర్తింపు దక్కింది. హిట్ దక్కింది కదా అని వరసపెట్టి మూవీస్ ఏం చేసేయలేదు. కానీ ఫొటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటోంది. అలానే మొన్నీమధ్య ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తుందా అనే డౌట్ వస్తోంది.

ఎందుకంటే తాజాగా సిద్ధాంత్-మృణాల్.. ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కి కలిసి వెళ్లారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. ఇతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వీళ్లిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి ఉంటారని పలువురు నెటిజన్లు అంటున్నారు. వీటిలో ఏది నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)