స్టార్‌ హీరోతో ఛాన్స్ కొట్టేసిన సీతారామం బ్యూటీ..!

Published on Tue, 08/22/2023 - 14:57

సీతారామం సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఇటీవల తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్‌-2లోనూ మెరిసింది. అయితే ప్రస్తుతం తమిళ స్టార్ హీరోతో ఆమె జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మావీరన్(మహావీరుడు) చిత్రంతో హిట్ కొట్టిన శివ కార్తికేయన్‌కు జంటగా నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం.

(ఇది చదవండి:  నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్)  

మావీరన్ సక్సెస్ తర్వాత శివ కార్తికేయన్‌ మరో చిత్రానికి ఓకే చెప్పేశారు.  ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఈయన నటించనున్నారు. ఈ చిత్రంలో అతని సరసన బాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాగూర్‌ హీరోయిన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే శివ కార్తికేయన్ ప్రస్తుతం రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై కమలహాసన్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. దీనికి రాజ్‌కుమార్‌ పెరియ సామి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో మేజర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

కాగా.. ఈ  చిత్రంలో శివ కార్తికేయన్ మరోసారి పోలీస్‌ అధికారిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు కాక్కీసట్టై చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించారు. అదేవిధంగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం దర్బార్‌. ఇందులో రజినీకాంత్‌ పోలీస్‌ అధికారిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

(ఇది చదవండి: ఫోటోపై రియాక్ట్‌ అయిన రేణు దేశాయ్‌.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు)

ఆ తర్వాత ఏఆర్‌.మురుగదాస్‌ చాలా గ్యాప్‌ తీసుకుని శివ కార్తికేయన్‌ హీరోగా మరోసారి పోలీస్‌ కథనే నమ్ముకుని చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని స్పైడర్‌ చిత్ర నిర్మాతలు నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్‌ సంగీతం అందించినట్లు, షూటింగ్‌ అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)