Breaking News

రీమేక్‌ల కాలం ముగిసింది.. ఒరిజినల్ కథలే ఆయుధం

Published on Sun, 03/08/2026 - 23:28

ఒకప్పుడు రీమేక్ హక్కులు దక్కించుకోవడం అంటే నిర్మాతలు గర్వంగా చెప్పుకునేవారు.అది వారకి ఎంతో గర్వకారణం. మినిమం గ్యారెంటీ అనే భరోసా కూడా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సినిమా రీమేక్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్‌ను చూసి పోల్చడం అలవాటుగా మారింది. దాంతో ఈ పోలికల్లో సినిమాలోని లోపాలు ఎక్కువగా బయటపడటంతో రీమేక్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నాయి.  

ఇటీవల సూర్య హీరోగా నటిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్ర యూనిట్ తమ సినిమా మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన కంగారూ రీమేక్ అని వచ్చిన ప్రచారంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ సినిమా పోస్టర్లు ఒకేలా కనిపించడంతో ఈ పుకారు మొదలైంది. దాంతో వెంటనే యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. తమ సినిమా ఒరిజినల్ కథతో వస్తోందని స్పష్టం చేశారు.  

అలాగే పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ కూడా మొదటి నుంచి ‘తేరి’ రీమేక్ అని ప్రచారం నడిచింది. ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇది రీమేక్ కాదని సుదీర్ఘంగా వివరణలు ఇస్తున్నాడు. ప్రేక్షకులు ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో హిట్ అయితే ఏంటి గొప్ప? అని ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా విజృంభనతో రీమేక్ విషయాలు దాచిపెట్టడం అసాధ్యం అయ్యింది.రీమేక్ అని తెలిసిన వెంటనే ట్రోలింగ్ మరింత పెరిగింది.ఫలితంగా నిర్మాతలు రీమేక్‌లకు పూర్తిగా దూరమవుతున్నారు.  

ఇప్పుడు ఎక్కడైనా తమ సినిమా రీమేక్ అని ప్రచారం జరిగితే చిత్ర యూనిట్లు వెంటనే మీడియా ముందుకొచ్చి ఖండించడం మొదలుపెట్టాయి. రీమేక్ అనే ముద్ర పడకుండా కిందామీద పడుతున్నారు. మొత్తానికి రీమేక్‌ల కాలం ముగిసింది. ఒరిజినల్ కథలే ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షించే ప్రధాన ఆయుధం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)