తెలుగు డైరెక్టర్.. నా థైస్ కొలతలు అడిగాడు: మౌనీషా చౌదరి

Published on Wed, 06/04/2025 - 16:15

తెలుగు సినిమా ఇండస్ట్రీ.. పైకి కనిపించేంత అందంగా అయితే ఉండదు. ఎప్పటికప్పుడు పలువురు యంగ్ హీరోయిన్లు, యువతులు.. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెడుతుంటారు. శారీరకంగా ఎంతలా ఇబ్బంది పడ్డామనే విషయాన్ని చెబుతుంటారు. ఇప్పుడు కూడా మోడల్ కమ్ నటి అయిన మౌనీషా చౌదరి.. ఓ తెలుగు దర్శకుడి వల్ల తాను ఇబ్బంది పడిన విషయాన్ని బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి పంచుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ)

'టాలీవుడ్‌కి చెందిన ఓ దర్శకుడు.. నాకు ఫోన్ చేసి ఆయన తీస్తున్న సినిమాలో నటించమని కోరాడు. అవకాశం ఇస్తానని కూడా చెప్పాడు. నాకు ఆ మూవీలో నటించడం ఇష్టం లేదు. ఇదే ఆయనకు చెప్పినా సరే వినకుండా నా తొడల సైజ్(కొలతల) గురించి అడిగి ఇబ్బంది పెట్టాడు. అసలు సినిమా అవకాశానికి, దానికి సంబంధం ఏంటి? ప్రస్తుతం ఆ దర్శకుడు స్టార్ అయిపోయాడు. పెద్ద పెద్ద యాక్టర్స్‌తో మూవీస్ చేస్తున్నాడు' అని మౌనీషా చౌదరి చెప్పుకొచ్చింది.

మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి.. ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటుంది. 2016లో 'మిస్ ఆసియా ఉతా'గా కిరీటం గెలుచుకుంది. స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్‌గానే అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి 'కన్నప్ప' టూర్‌లో పాల్గొంది. సినిమాను ప్రమోట్ కూడా చేసింది. అలాంటి ఈమె.. తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. కానీ సదరు దర్శకుడు పేరేంటి అనేది మాత్రం చెప్పలేదు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్)

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)