Breaking News

దక్షిణాది నిర్మాతతో పెళ్లి.. ఆ సమస్య రాలేదన్న లాల్‌ సింగ్ చద్దా నటి!

Published on Sun, 07/21/2024 - 18:35

లాల్ సింగ్ చద్దా, అమావాస్, 3 ఇడియట్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి మోనా సింగ్.  జస్సీ జైస్సీ కోయి నహిన్ అనే సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న భామ పలు సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఇటీవల ముంజియా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మోనా సింగ్‌ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.

బాలీవుడ్ సినిమాలతో అలరించిన మోనా సింగ్.. దక్షిణాదికి చెందిన ప్రముఖ చిత్రనిర్మాత, కోలీవుడ్‌కు చెందిన శ్యామ్ రాజగోపాలన్‌ను  వివాహం చేసుకుంది. వీరిద్దరు డిసెంబర్ 27, 2019న ముంబయిలో సాంప్రదాయ సిక్కు వేడుకతో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. తాజా ఇంటర్వ్యూలో మీకు మీ భర్త భాష నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు. 

దీనిపై ఆమె మాట్లాడుతూ..'నాకు తమిళం కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. నా భర్త శ్యామ్ నిజంగా గొప్ప వ్యక్తి. ఆయనను పెళ్లి చేసుకున్నందుకు నా ఫ్రెండ్స్‌ చాలా సంతోషించారు. మీ ఇంట్లో సౌత్‌ఇండియా ఫుడ్‌ బాగా దొరుకుతుందని ఆనందపడేవారు. బహుశా నేను అతన్ని తప్ప మరో నటుడిని చేసుకుని ఉంటే భరించలేకపోయేదాన్ని. మేము  చాలా సంతోషంగా ఉన్నాం. మేమిద్దరం ఓకే ఇండస్ట్రీ వాళ్లం కావడం నాకు చాలా నచ్చింది. అంతే కాకుండా ఆయన నిర్మాత, దర్శకత్వం మాత్రమే కాదు. థియేటర్‌ను కూడా నిర్వహిస్తాడు. నేను ఎక్కడైనా ఆగిపోతే నాకు అండగా నిలుస్తాడు.' అంటూ తన భర్తపై ప్రశంసలు కురిపించింది. ఇటీవల మోనా సింగ్‌ నటించిన ముంజియా చిత్రం సక్సెస్‌ వైపు దూసుకెళ్తోంది. 
 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)