Breaking News

ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Fri, 06/26/2026 - 14:57

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో క్రేజ్ ఉండనే ఉంది. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఓ సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: మీ దుస్తులు మీ ఇష్టం.. వాడి కళ్లు వాడి ఇష్టం: సింగర్ సునీత)

'ప్రేమలు' సినిమాతో తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న నస్లేన్ లేటెస్ట్ మూవీ 'మాలీవుడ్ టైమ్స్'. సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. గతంలో 'ఉన్ని ముకుందన్ అసోసియేట్స్' అనే డార్క్ కామెడీ మూవీ తీసిన అభినవ్ సుందర్ నాయక్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ నెల 5న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడీ మూవీ వచ్చే నెల 3వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

మాలీవుడ్ టైమ్స్ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి హారర్ నవల్స్ చదివి, హారర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ, మనోజ్ నైట్ శ్యామలన్,స్పీల్‌బర్గ్ లాంటి దర్శకులని మించిపోవాలని ఓ కుర్రాడు ఆశపడుతుంటాడు. అలాంటివాడు.. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి, అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడు? తన కథని, తన ఆలోచనల్ని వేరొకడు తెరపై ముందే ప్రెజెంట్ చేసేసినప్పుడు తన మూవీని చావుతో కనెక్ట్ చేసి హిట్ చేద్దామనుకున్నప్పుడు దర్శకుడిగా తన ప్రతిభ మాత్రమే తెరపై కనపడాలనుకుని కోరుకునే కుర్రాడు ఎలా ఫీలయ్యాడు? ఏం చేశాడనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: నన్ను ‘బిగ్‌బాస్‌’లోకి తీసుకోండి.. ఎస్సై విజ్ఞప్తి, వీడియో వైరల్‌)

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)