Breaking News

సావిత్రి పాటకు అసభ్యంగా డ్యాన్స్‌.. సపోర్ట్‌ చేసిన డైరెక్టర్‌?

Published on Thu, 04/17/2025 - 12:52

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఐకానిక్‌ సాంగ్స్‌లో అహ నా పెళ్లంట ఒకటి. ఈ సాంగ్‌లో సావిత్రి కేవలం డ్యాన్స్‌ చేయడమే కాకుండా అద్భుతంగా హావభావాలు పండించింది. ఈ పాటను తాజాగా ఓ డ్యాన్స్‌ షోలో ఖూనీ చేశారు. పొట్టి డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్‌తో పాటను చెడగొట్టేశారు. ఆ ఎపిసోడ్‌కు గెస్టుగా వెళ్లిన డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) కాస్త ఆశ్చర్యపోతూనే కొత్తగా ఉందని మెచ్చుకున్నాడు.

స్వేచ్ఛ లేదు
పాటను ఖూనీ చేస్తుంటే ప్రశ్నించాల్సిందిపోయి ఇలా వంతపాడటమేంటని విమర్శలు వచ్చాయి. సారంగపాణి జాతకం సినిమా ఈవెంట్‌లో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. మోహనకృష్ణ మాట్లాడుతూ.. సాధారణంగా ఇలాంటి షోలకు అతిథులుగానే వెళ్తాం. అలా వెళ్లినప్పుడు మా పరిపూర్ణ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండదు. పైగా వాళ్లు కష్టపడి డ్యాన్స్‌ చేసినప్పుడు ఎంతో కొంత అభినందించాల్సిందే! ఆ అమ్మాయి నిజంగానే కష్టపడి డ్యాన్స్‌ చేసింది.

కర్మకాలి..
కాకపోతే ఆ పాటకు అలాంటి డ్యాన్స్‌ చేయొచ్చా? సందర్భానికి తగినట్లుగా ఉందా? లేదా? అన్నది చర్చనీయాంశం.. ఇకపోతే మేము షోకు వెళ్లినప్పుడు సాధారణంగా నవ్వినదాన్ని కూడా కట్‌ చేసి ఇంకోచోట చూపిస్తారు. అంతకుముందు కూడా కర్మకాలి నవ్వి ఓ వివాదంలో ఇరుక్కున్నాను. దానికి క్షమాపణ చెప్పే స్థితికి తీసుకొచ్చారు. అయితే ఇలాంటి షోలకు వెళ్లినప్పుడు సభామర్యాద పాటించి వారిని విమర్శించకూడదు. బెల్లీ డ్యాన్స్‌ అంటే నాకు ఇష్టమే. కానీ ఆ పాటకు అది సెట్‌ కాదనిపించింది. అయినా అవన్నీ అక్కడ చర్చించలేం అని క్లారిటీ ఇచ్చాడు. మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సారంగపాణి జాతకం ఏప్రిల్‌ 25న విడుదల కానుంది.

చదవండి: డిప్రెషన్‌.. అందుకే దూరమయ్యా.. క్షమించండి: నజ్రియా

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)