నా తల్లికి పుట్టుకతోనే చెవులు వినిపించవు.. బాధేసేది: మోహన్‌బాబు

Published on Thu, 06/05/2025 - 18:06

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప (Kannappa Movie). శివుడి కోసం కన్నప్ప తన జీవితాన్నే త్యాగం చేశాడని.. అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒక కన్నప్ప ఉంటారని ఆ స్టోరీ చెప్పమంటూ కొత్త తరహా ప్రమోషన్స్‌ మొదలుపెట్టాడు విష్ణు (Vishnu Manchu). మై కన్నప్ప స్టోరీ అంటూ ముందుగా తనే ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. తన జీవితంలో తండ్రి మోహన్‌బాబు కన్నప్ప అని.. ఆయన కృషి, త్యాగాల ఫలితంగానే నటుడిగా అందరి ముందు నిలబడ్డానని చెప్పాడు.

అమ్మకు చెవులు వినిపించవు
తాజాగా మోహన్‌బాబు తన కన్నప్ప స్టోరీని షేర్‌ చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ఓ అమాయకుడు, ఆటవికుడైన తిన్నడు.. పరమేశ్వరుడికి కళ్లు ఇచ్చి కన్నప్పగా చరిత్రలో మిగిలిపోయాడు. మన జీవితంలో అమ్మ చెప్పకుండానే మన ఆకలి తీరుస్తుంది. లైఫ్‌లో ఏది కావాలంటే అది, శక్తికి మించినదైనా సరే అమ్మానాన్న మనకు ఇస్తుంటారు. నా దృష్టిలో మా అమ్మానాన్న నా కన్నప్పలు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ. దురదృష్టవశాత్తూ అమ్మకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించవు.

ఐదుమంది సంతానం
ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదు మంది సంతానాన్ని ఇచ్చాడు. బస్సు దిగి మా ఊరికి నడిచి వెళ్లాలంటే ఏడు కి.మీ. నడిచి వెళ్లాలి. ఆ దారి కూడా సరిగా ఉండేది కాదు. చెవులు వినిపించని నా తల్లి ఐదుమంది బిడ్డల్ని మోసుకుని మా ఊరికి వెళ్లేదంటే ఎంత కష్టమో ఆలోచించండి. దారిలో ఒక కాలువ, సువర్ణముఖి నది దాటి వెళ్లాలి. మాది ద్వీపంలాంటి ఊరు. అప్పుడప్పుడు ఈ విషయాలు తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

నా మాటలు తల్లికి వినిపిస్తే బాగుండు
నా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటున్నప్పుడు... నా మాటలు తల్లికి వినిపించుంటే ఎంత బాగుండేదనిపిస్తుంది. ఈ విషయంలో అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. నాకు నా కన్నతల్లే కన్నప్ప అని చెప్పుకొచ్చాడు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

 

చదవండి: 'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే

Videos

ఫాన్స్ అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డ సామ్

దుఃఖాన్ని దిగమింగుకొని స్మృతి మంధాన విశ్వరూపం

వంట మనుషులతో MOUలు.. ఇదేం పాడుపని బాబు

అప్పులపాలై.. బెట్టింగ్ యాప్స్ కు బలైన హైడ్రా కమిషనర్ గన్ మెన్..

కోడలితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే..

హీట్ పెంచిన KCR కామెంట్స్.. రేవంత్, బాబుపై సెటైర్లు

పండుగను తలపించేలా జగన్ జన్మదిన వేడుకలు..

కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్

YS జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్..

ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు

Photos

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)

+5

జగన్‌ మావయ్యతో క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)

+5

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌.. అరుదైన (రేర్‌) ఫొటోలు

+5

ఏపీవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ ముందస్తు బర్త్‌ డే వేడుకలు (ఫొటోలు)