Breaking News

కన్నప్ప అట్టర్‌ ఫ్లాప్‌ అంటూ ట్రోలింగ్‌.. మోహన్‌బాబు రియాక్షన్‌ ఇదే!

Published on Sat, 07/12/2025 - 13:08

కన్నప్ప సినిమా (Kannappa Movie)కు విమర్శలు కొత్తేమీ కాదు. మూవీ ప్రకటించినప్పటినుంచి ఎప్పుడూ ఏదో రకంగా విమర్శిస్తూనే ఉన్నారు. అయితే సినిమా నుంచి ఎప్పుడైతే భక్తి పాటలు రిలీజయ్యాయో అప్పుడే ఎత్తిన ప్రతివేలు ముడుచుకుంది, జారిన ప్రతి నోరు అదుపులో పెట్టుకుంది. జూన్‌ 27న రిలీజైన కన్నప్ప చిత్రాన్ని చూసి ఎంతోమంది మంత్రముగ్ధులయ్యారు.

ట్రోలింగ్‌పై స్పందించిన మోహన్‌బాబు
విష్ణు నటనకు ఫిదా అయ్యారు. దర్శకుడి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కానీ కొందరు మాత్రం అదే పనిగా విమర్శిస్తూనే ఉన్నారు. సినిమా ఫ్లాప్‌, అట్టర్‌ ఫ్లాప్‌.. కన్నప్ప ఏమీ బాగోలేదని కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఈ ట్రోలింగ్‌పై మోహన్‌బాబు స్పందిస్తూ.. విమర్శ - సద్విమర్శ, ప్రకృతి- వికృతి.. ఇలా రెండూ ఉంటాయి. ఓ గొప్ప పండితుడు ఏమన్నారంటే.. మోహన్‌బాబుగారు, జరిగేదంతా చూస్తున్నాను. 

కన్నప్ప మూవీ గురించి..
గత జన్మలో లేదా ఈ జన్మలో తెలిసీతెలియక మీరేదైనా తప్పులు చేసుంటే ఇలా విమర్శించేవారంతా మీ కర్మను తీసుకెళ్తున్నారని అర్థం. కాబట్టి వారిని ఆశీర్వదించండి అన్నారు. వారి గురించి నేనేం మాట్లాడను. వాళ్లు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. కన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించాడు.

చదవండి: మూడు రోజుల్లో బిగ్‌బాస్‌ బ్యూటీ బర్త్‌డే.. లక్ష రూపాయలతో

Videos

హైదరాబాద్ దిల్‍సుఖ్‍నగర్ కాల్పులు

ఉప్పాల హారిక పై పచ్చ సైకోలు దాడి.. సాకే శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు

దొంగకు వింత వింత పనిష్మెంట్లు

ఏసీబీ అదుపులో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు

జనసేన రాయుడు హత్య వెనుక ఎమ్మెల్యే హస్తం

లార్డ్స్ టెస్ట్ లో భారత్ ఓటమి

గంజాయి బ్యాచ్ కు కిరాయి.. హారిక హత్యకు కుట్ర

ఢిల్లీ హైకోర్టులో బాబుకు మొట్టికాయలు

ఎవరు ఈ మహానటి..? తెరవెనుక..

కాంగ్రెస్ నేత మరెల్లి అనిల్ ను చంపిన దుండగులు

Photos

+5

600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)

+5

ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్‌ జంట విడాకులు (ఫొటోలు)

+5

బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం సాగరతీరంలో సండే సందడి (ఫొటోలు)

+5

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)