Breaking News

కోట కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌బాబు

Published on Mon, 07/21/2025 - 11:15

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(83).. వారం క్రితం చనిపోయారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కన్నుమూయడంతో తెలుగు సినీప్రముఖులు చాలామంది తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే ఆ రోజు ఊరిలో లేకపోవడంతో ఇప్పుడు వచ్చి కోట కుటుంబాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)

'కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం రోజు నేను హైదరాబాద్‌లో లేను. కోట మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 1987లో వీరప్రతాప్ సినిమాలో మాంత్రికుడు‌గా అవకాశం ఇచ్చారు. మా బ్యానర్‌తో పాటు బయట బ్యానర్‌లోనూ ఆయన‌తో చాలా సినిమాలు చేశా. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన నటుడు. ఏ  డైలాగ్ అయినా విలన్‌గా కమెడియన్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్‌లో చెప్పగలిగే నటుడు కోట. మా ఫ్యామిలీకి ఆయన అత్యంత సన్నిహితులు. ఆయన మరణం నా కుటుంబానికే కాదు, సినిమా పరిశ్రమకే తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్)

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)