అఫీషియల్ ప్రకటన.. ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌

Published on Mon, 08/18/2025 - 15:47

ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు, సిరీస్‌లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ జోనర్‌లో వచ్చే సిరీస్‌లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే ఆ జోనర్‌లో వచ్చిన చిత్రాలు, సిరీస్‌లు చాలా వరకు సూపర్ హిట్‌గా నిలిచాయి.

తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్‌ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్‌ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌  వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

రాఖ్‌ (Raakh) పేరుతో ఈ ఆసక్తికర వెబ్ సిరీస్‌ను ప్రొసిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాతాళ్ లోక్‌ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్‌లో సోనాలి బింద్రే, ఆమిర్‌ బషీర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను అనూష నందకుమార్‌, సందీప్‌ సాకేత్‌ నిర్మిస్తున్నారు.

 

 

Videos

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)