Breaking News

రెబల్‌ స్టార్‌ రాజాసాబ్‌...మిరాయ్‌ని మరిపిస్తాడా?

Published on Tue, 09/16/2025 - 12:14

ఓ వైపు పెద్ద పెద్ద హీరోల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో వస్తున్న చిత్రాలు ఊరించి ఊరించి ఉస్సురుమనిపిస్తున్నాయి. మరోవైపు ప్రేక్షకుల్లో పెద్దగా ఫాలోయింగ్‌ లేని స్టార్స్‌ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేస్తున్నాయి. అది మరీ వింత కాకపోయినా ఈ మధ్య తరచుగా జరుగుతుండడమే గమనార్హం. మరీ ముఖ్యంగా బలమైన నెట్‌ వర్క్,సమర్ధులైన సాంకేతిక నిపుణులు పనిచేసిన భారీ చిత్రాల్లో గ్రాఫిక్స్‌ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక అప్రతిష్ట పాలవుతున్నాయి. ఇటీవల విడుదలైన విశ్వంభర టీజర్‌ గానీ, హరి హర వీరమల్లు, కన్నప్ప లాంటి సినిమాలే దీనికి నిదర్శనం. అదే సమయంలో చిన్న చిత్రాల్లోని గ్రాఫిక్స్‌ కళ్లప్పగించేలా చేస్తూ సినిమాని బ్లాక్‌ బస్టర్‌గా మారుస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు మిరాయ్‌(Mirai Movie) కూడా జేరింది.  

విడుదలైన రోజు నుంచి  మిరాయ్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లతో  పాటు సమీక్షలు కూడా సాధిస్తోంది. ఈ చిత్రం బృందంలో సాంకేతికత పాత్ర  భారీగా ప్రశంసలు అందుకుంటోంది. అత్యంత ఆశ్చర్యకరంగా, హాలీవుడ్‌లోని అంతర్జాతీయ విఎఫ్‌ఎక్స్‌ కంపెనీలతో సమానమైన అవుట్‌పుట్‌ను మిరాయ్‌ బృందం అందించగలిగింది. మరో షాకింగ్‌ విషయం ఏమిటంటే... ఇదంతా హైదరాబాద్‌లోనే స్థానికంగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నియమించిన టీమ్‌ ఈ అద్భుతమైన ఆవిష్కరణను అందించడం.

ట్రైలర్‌ విడుదలైనప్పుడే వీక్షకులు అందరూ అవుట్‌పుట్‌కి ఆశ్చర్యపోయారు  నేడు, సినిమా థియేటర్లలో ఇంటర్వెల్‌ ముందు పక్షి ఎపిసోడ్, ట్రైన్‌ ఎపిసోడ్, రాముడి సీన్లు...తెరపైన ఆవిష్కృతమవుతుంటే..  ప్రేక్షకులు ఆ అద్భుతమైన గ్రాఫిక్స్‌ పనితీరుని కళ్లప్పగించి చూస్తుండటం కనిపిస్తోంది. ఇటీవల అనేక భారీ బడ్జెట్‌ చిత్రాలు పరిశ్రమలలోని టాప్‌ కంపెనీల నుంచి  కూడా నమ్మదగిన విఎఫ్‌ఎక్స్‌ అవుట్‌పుట్‌ను పొందడంలో తరచుగా విఫలమవుతున్న పరిస్థితిలో హైదరాబాద్‌లోని సాంకేతిక నిపుణులే దీనిని సాధించగలగడం మరింత ఆశ్చర్యానందాలను కలిగిస్తోంది.   విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ లో ఎటువంటి అస్పష్టత రాకుండా కూడా చిత్రబృందం చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నారు, పరిమిత వనరులతోనే టీమ్‌ మిరాయ్‌ ఈ అద్భుతమైన అవుట్‌పుట్‌ను సాధించడం గమనార్హం.

ఈ  సినిమా సాధించిన అనూహ్య విజయం రాబోయే మరో అగ్రహీరో ప్రభాస్‌ భారీ చిత్రం రాజా సాబ్‌(The Raja Saab) ను చర్చనీయాంశంగా మారుస్తోంది. ఎందుకంటే పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న రాజాసాబ్‌ కూడా  మిరాయ్‌ ను అందించిన అదే ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి  రానుంది. రెబల్‌ స్టార్‌ అభిమానులు ఈ చిత్రానికి కూడా అదే రకమైన అవుట్‌పుట్‌ ను ఊహిస్తున్నారు.  దాంతో ఆ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగి ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయి.  రాజా సాబ్‌ ఒక హర్రర్‌ డ్రామా, దీనిని చాలా వరకూ  సెట్‌లోనే చిత్రీకరించారు  దాంతో విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చాలా అవసరమైంది. ఈ సినిమా బృందం విడుదల చేసిన  టీజర్‌ కూడా బాగుంది మిరాయ్‌ లాగే దీనికి కూడా అద్భుతమైన గ్రాఫిక్స్‌ జతగూడితే...ప్రభాస్‌ అనే అగ్నికి ఆజ్యం పోసినట్టే అయి ఇక అభిమానులకు రికార్డుల పండగే అని చెప్పొచ్చు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు