Breaking News

మీకెంత ధైర్యం అలా చేయడానికి?.. బాడీ షేమింగ్‌పై నటి ఆగ్రహం

Published on Sun, 08/24/2025 - 13:56

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌ను బాడీ షేమింగ్ చేయడాన్ని మరో నటి, టీవీ హోస్ట్ మిని మాథుర్‌ తప్పుపట్టింది. ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కాజోల్ వీడియోను పోస్ట్‌ చేయడంపై మండిపడింది. అసలు ఆమె బాడీని జూమ్ చేయడానికి నీకెంత ధైర్యం..తాను ఎలా కనిపించాలనేది తన ఇష్టమని.. మీరేలా డిసైడ్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాజోల్‌ వీడియోను జూమ్‌ చేస్తూ పోస్ట్‌ చేసిన వీడియోపై మిని మాథుర్ ఈ విధంగా స్పందించింది.

కాగా.. బాలీవుడ్ నటి కాజోల్ తన లేటేస్ట్ వెబ్ సిరీస్ ది ట్రయల్ రెండో సీజన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు, ఇందులో ఆమె నోయోనికా సేన్‌గుప్తా ‍అనే లాయర్ పాత్రను పోషించారు. ముంబై జరిగిన ఈ ఈవెంట్‌లో కాజోల్ బ్లాక్‌ స్కర్ట్ డ్రెస్‌లో కనిపించింది. దీంతో వెంటనే డ్రెస్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇది చూసిన నటి మిని మాథుర్ అలాంటి వారికి ఇచ్చిపడేసింది. అయితే తనపై వచ్చిన బాడీ-షేమింగ్ వ్యాఖ్యలపై కాజోల్ ఇంకా స్పందించలేదు.

m

మరోవైపు ది ట్రయల్ వెబ్ సిరీస్‌కు మొదటి సీజన్‌కు ప్రశంసలు వచ్చాయి. ఈ సిరీస్‌లో మరోసారి కాజోల్ న్యాయవాది నోయోనికా సేన్‌గుప్తాగా అలరించనుంది. ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా ఆమె భర్తగా కనిపించనున్నారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2023లో విడుదలైంది. ఇందులో సోనాలి కులకర్ణి, షీబా చద్దా, అలీ ఖాన్, కుబ్రా సైట్, గౌరవ్ పాండే, కరణ్‌వీర్ శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సీజన్ సెప్టెంబర్ 19, 2025న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)