Breaking News

ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా

Published on Fri, 12/19/2025 - 18:14

ఈ వారం థియేటర్లలోకి 'అవతార్ 3' వచ్చింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఇదేమంత కొత్తగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటిలో సంతాన ప్రాప్తిరస్తు, ప్రేమంటే, డొమినిక్ ద లేడీస్ పర్స్, మఫ్టీ పోలీస్, దివ్యదృష్టి చిత్రాలతో పాటు నయనం, ఫార్మా సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.

(ఇదీ చదవండి: ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ మూవీ రివ్యూ)

ఇ‍ప్పుడు తమిళ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. గత నెల 21న థియేటర్లలో రిలీజై హిట్ అయిన మూవీ 'మిడిల్ క్లాస్'. సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మునిష్ కాంత్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. విజయలక్ష‍్మీ ఇతడి సరసన నటించింది. మిడిల్ క్లాస్ కష్టాలపై దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడీ మూవీ వచ్చే బుధవారం (డిసెంబరు 24) నుంచి జీ5 ఓటీటీలోకి రానుంది.

'మిడిల్ క్లాస్' విషయానికొస్తే.. నిత్యం ఆర్థిక ఇబ్బందులు, నెల తిరిగేసరికి కట్టాల్సిన ఈఎంఐలు, బడ్జెట్ లెక్కలు.. ఇలా సగటు మధ్యతరగతి కష్టాలతో బాధపడే ఓ కుటుంబానికి.. తమ సమస్యలన్నీ ఒకేసారి తీరిపోయే అరుదైన అవకాశం వస్తుంది. మరి అప్పుడు ఆ ఫ్యామిలీ ఏం చేసింది? తర్వాత ఎదురైన పరిణామాలు ఏంటి? అనేదే మిగతా స్టోరీ. కిశోర్ రామలింగం దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్ చేస్తుంది. ఇప్పటికైతే తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని చెప్పారు. త్వరలో తెలుగు డబ్బింగ్‌ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది.

(ఇదీ చదవండి: దురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)