Breaking News

ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ 'మైఖేల్'.. అధికారిక ప్రకటన

Published on Tue, 07/28/2026 - 15:37

పాప్ సాంగ్స్ అనగానే చాలామంది మైఖేల్ జాక్సన్ గుర్తొస్తాడు. 90ల్లో తనదైన గొంతుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 2009లో చనిపోయాడు. ఇకపోతే ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజై అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్ల కోసమా అన్నట్లు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.

(ఇదీ చదవండి: అఫిషియల్‌ : నెలలోలోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్‌’)

ప్రపంచ ప్రఖ్యాత పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథతో తీసిన సినిమాకు 'మైఖేల్ అని పేరు పెట్టారు. ఇందులో ఇతడి మేనల్లుడు జాఫర్ జాక్సన్.. టైటిల్ రోల్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 24న బిగ్ స్క్రీన్స్‌పై రిలీజైంది. కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చలేదు. ఏదైతేనేం దాదాపు రూ.10 వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మన దేశంలో అయితే రూ.54 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ మార్క్‌ని దాటిన తొలి హాలీవుడ్ బయోపిక్‌గానూ రికార్డు సృష్టించింది.

ఇకపోతే గత నెల 9నే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ, బుక్ మై షో లాంటి ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా.. ఆగస్టు 29 నుంచి హాట్‌స్టార్‌లో ఉచితంగానే స్ట్రీమింగ్ కానుంది. కాకపోతే ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ కానుందని ప్రకటించారు.

'మైఖేల్' విషయానికొస్తే.. అమెరికాలోని ఇండియానా గ్యారీలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మైఖేల్ జాక్సన్ (జాఫర్ జాక్సన్) తన తల్లి ప్రోత్సాహంతో, సోదరులతో కలిసి 'జాక్సన్ 5' బ్యాండ్‌తో తన ప్రతిభని చాటుకుంటాడు. అయితే తన తండ్రి జోసెఫ్ జాక్సన్ (కోల్మన్ డొమింగో) కఠినమైన ప్రవర్తన మైకేల్‌ని మానసిక వేదనకు గురిచేస్తుంది. ఆ భయం నీడలోనే ఒంటరిగా కెరీర్‌ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు? తన బాల్యాన్ని వెతుక్కుంటూ అతడు నిర్మించుకున్న 'నెవర్ ల్యాండ్' వెనుక ఉన్న ఎమోషన్ ఏంటి? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)