Breaking News

లగ్జరీ కారు కొన్న మెహబూబ్‌ దిల్‌సే, ఎన్ని లక్షలో తెలుసా?

Published on Sun, 04/23/2023 - 14:11

గుంటూరు మిర్చి లాంటి కుర్రోడు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే కొత్త కారు కొన్నాడు. ఈద్‌ పండగ సందర్భంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును ఇంటికి తెచ్చుకున్నాడు. దీని ధర రూ.15 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్‌ కలర్‌లో మెరిసిపోతున్న కారు ముందు దిగిన ఫోటోలను మెహబూబ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ఇది చూసిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు సోహైల్‌, శ్రీరామచంద్ర, కాజల్, అర్జున్‌ కల్యాణ్‌, రవికృష్ణ తదితరులు అతడికి శుభాకాంక్షలు చెప్తున్నారు. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అన్నా అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. రంజాన్‌ మాసం కావడంతో తన స్నేహితులకు ఇఫ్తార్‌ పార్టీ కూడా ఇచ్చాడు మెహబూబ్‌.

కాగా మెహబూబ్‌ టిక్‌టాక్‌ వీడియోలు, వెబ్‌ సిరీస్‌లతో పాపులర్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌తో అతడికి కావాల్సినంత గుర్తింపు లభించింది. బిగ్‌బాస్‌ 4 గ్రాండ్‌ ఫినాలే వేదికగా చిరంజీవి అందించిన పది లక్షల రూపాయలకు తోడు తను సంపాదించిన డబ్బులను జత చేసి గుంటూరులో సొంతిల్లు కట్టుకున్నాడు. నిత్యం యూట్యూబ్‌ వీడియోలు, వెబ్‌ సిరీస్‌లతో మెహబూబ్‌ తన అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు.

చదవండి: సినిమా హిట్‌.. థియేటర్‌కు వెళ్లిన దర్శకుడికి షాక్‌..

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)