Breaking News

మెగాస్టార్ టాప్ టెన్ హిట్స్ మీకు తెలుసా?

Published on Tue, 08/22/2023 - 14:26

శివశంకర వరప్రసాద్ అంటే కొందరు గుర్తు పట్టలేరమో తెలియదు కానీ.. మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండియాలో ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు.   అంతలా సినీ ఇండస్ట్రీలో తన ముద్ర వేసుకున్నారు మెగాస్టార్. ఆగస్టు 22, 1955న ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో జన్మించిన చిరంజీవి తన నట జీవితాన్ని 1970లో ప్రారంభించారు. దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించిన మెగాస్టార్ ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఠాగూర్ సూపర్ హిట్ చిత్రాలతో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. 

1978లో  పునాదిరాళ్లు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన మెగాస్టార్ ఆ తర్వాత  విజేత, గూఢచారి -116 లాంటి వంటి చిత్రాలలో విభిన్న పాత్రలలో మెప్పించారు. 1980లలో చిరంజీవి ఖైదీ, జ్వాల, ఛాలెంజ్ వంటి చిత్రాలు ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి.  ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, స్నేహం కోసం, ఠాగూర్ బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఆగస్టు 22, 2023న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం.  ఆయన కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌గా చిత్రాలేవో తెలుసుకుందాం. 

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇరవైకి పైగా సినిమాలు చేశారు మెగాస్టార్.  చిరంజీవి- కోదండరామిరెడ్డి  కాంబోలో వచ్చిన పసివాడి ప్రాణం ఓ రేంజ్‌లో క్రేజ్‌ను తెచ్చి పెట్టింది . అలాగే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన స్వయంకృషి ఆయన ప్రతిభను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది.  ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా ఈ సినిమాకు అందుకున్నారు.  

1.పసివాడి ప్రాణం

2. స్వయంకృషి

3. జగదేకవీరుడు అతిలోకసుందరి 

4.గ్యాంగ్ లీడర్

5.ఖైదీ

6. ముఠామేస్త్రి
 
7.ఘరానా మొగుడు

8.చూడాలని ఉంది

9.ఠాగూర్

10.ఇంద్ర 


ఇవే కాకుండా అప్పట్లో చిరు ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు.  ఛాలెంజ్, రుద్రవీణ, అడవి దొంగ , విజేత, చంటబ్బాయి, ఆరాధన, స్టేట్ రౌడీ, ఆపద్బాంధవుడు, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్, స్నేహం కోసం, సైరా నరసింహా రెడ్డి, ఖైదీ నెంబర్ 150  వంటి సినిమా లు చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. అయితే ఇటీవల రిలీజైన మెగాస్టార్ 156వ చిత్రం భోళాశంకర్‌ మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 

Videos

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)