Breaking News

చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు

Published on Sun, 03/08/2026 - 01:45

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డును ప్రకటించింది. అలాగే, పైడి జయరాజ్‌ అవార్డుకు సహజనటుడు కమల్‌ హాసన్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు 2025 సంవత్సరం గద్దర్‌ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్‌), ఉత్తమ నటిగా రష్మిక మందన్నా (ది గర్ల్‌ఫ్రెండ్‌)ను ఎంపిక చేసింది. అలాగే, తొలి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్‌ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్‌ ప్రీవెడ్డింగ్‌ షో’ ఎంపికయ్యాయి. అలాగే, జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా ‘తండేల్‌’ నిలిచింది.  


రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును ప్రసాద్‌ ఐ మ్యాక్స్‌ యజమాని రమేష్‌ప్రసాద్‌కు ప్రకటించారు. పలువురు పాతతరం వారికి స్పెషల్‌ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాలను ఉగాది (ఈనెల 19న) పర్వదినాన హైటెక్స్‌లో ప్రదానం చేయనున్నారు. మెయిన్‌ స్ట్రీమ్‌ అవార్డ్స్‌ అధ్యక్షుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్‌ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్‌ కాగా, పుస్తకాలు– సమీక్షల పరిశీలనకు తనికెళ్ల భరణి చైర్మన్‌గా వ్యవహరించారు. 


ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జ్యూరీ 2025వ సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజు, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక, జ్యూరీ సభ్యులు తనికెళ్ల భరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు అందచేశారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, ప్రదానోత్సవ నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జ్యూరీ పురస్కారాల జాబితాను ప్రకటించింది. 



 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)