Breaking News

సంక్రాంతి సినిమా హిట్.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

Published on Tue, 01/20/2026 - 16:44

మనశంకర వరప్రసాద్‌గారు మూవీ సూపర్ హిట్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తన సినిమాను సూపర్ హిట్‌ చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో తనకు ఎల్లప్పుడు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మెగాస్టార్ తన పోస్ట్‌లో రాస్తూ..'మన శంకరవరప్రసాద్ గారు సినిమాపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది. ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

మీరు వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్‌బస్టర్‌ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్‌ మెషీన్‌ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు, సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో... లవ్ యూ ఆల్.. ఇట్లు మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మనశంకర వరప్రసాద్‌గారు జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించారు. తాజాగా ఈ మూవీ అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన రీజినల్ సినిమాగా రికార్డ్ సృష్టించింది.
 

 

Videos

TDP MLA చేసిన అవమానం.. షరీఫ్ కు ముస్లిం నేతల పరామర్శ

సాత్విక వీరవల్లి హీరోయిన్ గా ఎంట్రీ..

జగన్ పై తప్పుడు రాతలు ఆంధ్రజ్యోతి పేపర్ ను తగలబెట్టిన YSRCP

బీఆర్ఎస్ VS పోలీస్ .. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద హైటెన్షన్

ఏ క్షణమైనా యుద్ధం.. రంగంలోకి ఫ్రాన్స్, జర్మనీ బలగాలు

అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్..

రక్తం కారేలా కొట్టుకున్న TDP, జనసేన కార్యకర్తలు

Varudu: బట్టలు విప్పి రికార్డింగ్ డాన్సులు వెయ్యండన్న వారిని ఎందుకు నడిరోడ్డుపై నడిపించలేదు..

నీ అబ్బా సొమ్ము అనుకుంటున్నావా? లోకేష్ పై నిప్పులు చెరిగిన సతీష్ రెడ్డి

చంద్రబాబుపై కేసులు ఎందుకు కొట్టేశారు? హైకోర్టు ఆగ్రహం

Photos

+5

సీతాకల్యాణం చేసిన 'బిగ్‌బాస్' ప్రియాంక సింగ్ (ఫొటోలు)

+5

2016లో సారా టెండుల్కర్‌ ఇలా.. పోస్ట్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

ఫ్యాషన్ ..అదిరెన్: కనువిందు చేసిన ఫ్యాషన్ షో (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

వాఘా బోర్డర్‌లో 'ధురంధర్' బ్యూటీ (ఫొటోలు)

+5

సముద్రపు ఒడ్డున సేదతీరుతున్న పూజిత పొన్నాడ -ఎంత బాగుందో! (ఫొటోలు)

+5

అల్లు అర్జున్ ఫ్యామిలీ.. జపాన్ ట్రిప్‌లో ఇలా (ఫొటోలు)

+5

టిల్లుగాని పోరీ.. మతిపోయే గ్లామరస్‌గా (ఫొటోలు)

+5

'శుభకృత్ నామ సంవత్సర' మూవీ ఈవెంట్‌లో పవిత్ర, నరేష్‌ (ఫోటోలు)

+5

టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)