Breaking News

గద్దర్‌ అవార్డ్స్ ప్రకటన.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్

Published on Thu, 05/29/2025 - 19:49

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్‌ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. 2024 ఏడాదిగానూ ఎంపికైన  అవార్డ్ గ్రహీతలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. సృజనాత్మక రంగంలోని ఏ కళాకారుడికైనా, సాంకేతిక సిబ్బందికైనా రాష్ట్ర గుర్తింపు అనేది చాలా విలువైనదని అన్నారు. ఇలాంటి అవార్డులు మరింత ప్రేరణనిస్తాయని రాసుకొచ్చారు.  

తెలంగాణ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించడం సినీ పరిశ్రమకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. అవార్డులు విషయంలో చొరవ చూపిన  ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా.. ఇవాళ జయసుధ నేతృత్వంలోనే జ్యూరీ గద్దర్ అవార్డులు-2024 విజేతలను ప్రకటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు.

ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ ఈ భారీ బడ్జెట్‌ సినిమాను నిర్మిస్తున్నారు.
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)