Breaking News

సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్.. ప్రధాని మోదీతో కలిసి జ్యోతి ప్రజ్వలన

Published on Tue, 01/14/2025 - 09:22

సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.  ప్రధాని మోదీతో పాటు జ్యోతి ప్రజ్వలన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
        
ఈ సంక్రాంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని కేంద్రమంత్రి  కిషన్‌ రెడ్డి  నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ పండుగ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు  కూడా పాల్గొన్నారు.  

విశ్వంభరలో చిరంజీవి..

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం  ‘విశ్వంభర’. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష  నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించనున్నారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో  విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. 

భోళా శంకర్‌ డిజాస్టర్‌ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఎంపిక చేశారు. ఫ్యాన్స్‌ కూడా ఒక భారీ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు.  ఈసారి ఇండస్ట్రీ హిట్‌ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. విశ్వంభర బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

Videos

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)