Breaking News

తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్‌.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్‌

Published on Sat, 06/28/2025 - 09:36

ఎన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో పని చేసినా కొందరు హీరోయిన్లకు తెలుగు అస్సలు రాదు. కానీ పైన కనిపిస్తున్న కథానాయిక మాత్రం స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనెవరో మీరీపాటికే గుర్తుపట్టేసి ఉంటారు. గుడ్‌నైట్‌ హీరోయిన్‌ మీథా రఘునాథన్‌ (Meetha Raghunath). 3 BHK సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మీథా అనర్గళంగా తెలుగు మాట్లాడింది. తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏమైనా తప్పులు దొర్లితే క్షమించండి అంటూ స్పీచ్‌ మొదలుపెట్టింది.

రెండోసారి..
మీరు నన్ను గుడ్‌నైట్‌ సినిమాలో చూసి ఉంటారు. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌ పట్ల మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు స్కూల్‌ ట్రిప్‌ కోసం తొలిసారి హైదరాబాద్‌కు వచ్చాను. ఇప్పుడు 3 BHK మూవీ కోసం రెండోసారి ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 3 BHK.. కలలను సాకారం చేసుకునే కథ. ఇది మా కథ మాత్రమే కాదు, మీ కథ.. మనందరి కథ. ఈ సినిమాను ప్రేమతో, హృదయపూర్వకంగా చేశాం. మీ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో థియేటర్‌కు వచ్చి సినిమా ఎంజాయ్‌ చేయండి. మీ అందరికీ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను.

తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా..
ఈ మూవీ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి సినిమా చూడండి, నన్ను సపోర్ట్‌ చేయండి అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రసంగం విని సిద్దార్థ్‌ నోరెళ్లబెట్టాడు. చాలా బాగా మాట్లాడావని మెచ్చుకున్నాడు. నెక్స్ట్‌ తెలుగు మూవీ చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్‌గా మాట్లాడతానని మీథా మాటిచ్చింది. ఇకపోతే మీథా రఘునాథ్‌ తెలుగులో డైరెక్ట్‌గా ఇంతవరకు సినిమా చేయలేదు. గుడ్‌నైట్‌ అనే తమిళ సినిమా తెలుగు వర్షన్‌తోనే ఇక్కడివారికి సుపరిచితురాలైంది. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ త్వరలోనే ఇక్కడ స్ట్రయిట్‌ ఫిలిం చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

తెలంగాణ అల్లుడిని కదా..
3 BHK మూవీలో శరత్‌కుమార్‌, సిద్దార్థ్‌, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సిద్దార్థ్‌ మాట్లాడుతూ.. 25 ఏళ్లయింది.. నేను ఇంతవరకు భూమి, ఇల్లు ఏవీ కొనలేదు. 3 బీహెచ్‌కే సినిమా చేస్తున్నప్పుడు తొలిసారి ఇల్లు కొనుక్కున్నాను. పెళ్లయ్యాక బాధ్యతలు పెరిగాయి కదా.. అసలే తెలంగాణ అల్లుడిని కదా! అందుకే నా భార్యతో కలిసి కొత్త ఇల్లు కొనుక్కున్నాను అని చెప్పుకొచ్చాడు.

చదవండి: 'కాంటా లగా' సాంగ్‌తో సెన్సేషన్‌.. నటి కన్నుమూత

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)