Breaking News

నేరుగా ఓటీటీకి మీరా జాస్మిన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్

Published on Tue, 03/18/2025 - 15:46

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్స్‌ మీరా జాస్మిన్, నయనతార  నటించిన చిత్రం 'ది టెస్ట్'.  ఈ సినిమాతో నిర్మాత శశికాంత్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో   మాధవన్, సిద్ధార్థ్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథనంతో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కించారు. వైనాట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఈ మూవీని తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. మీరా జాస్మిన్ ఫోటోలు షేర్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి టెస్ట్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో కూడా అందుబాటులో ఉండనుందని ట్విటర్ ద్వారా తెలిపింది.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగువారికి సుపరిచితమే. రవితేజ భద్ర సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లో గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది. అయితే కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. ఆ తర్వాత విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టెస్ట్‌ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)