Breaking News

డ్రైవింగ్‌ చేస్తూ నిద్ర పోతున్నాడు: హీరోయిన్‌

Published on Wed, 02/25/2026 - 13:00

హీరోయిన్‌ మీరా చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. క్షేమంగా, వేగంగా వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే డ్రైవర్‌ ప్రవర్తనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నానని చెప్తోంది. ఈ చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. ఉబర్‌ క్యాబ్‌ వల్ల నేను భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాను. మంగళవారం ఉదయం ఆరుగంటల కోసం కారు బుక్‌ చేసుకున్నాను. తీరా దుమ్ము, మురికి పట్టిన కారు వచ్చింది. డ్రైవర్‌ కూడా అంతే డర్టీగా ఉన్నాడు. కారు ఎందుకింత మురికిగా ఉందని డ్రైవర్‌ను అడిగాను. 

నిద్రపోతూ డ్రైవింగ్‌
కానీ, అతడు సమాధానం చెప్పే స్థితిలో లేడు. కారు నడుపుతూనే నిద్రపోతున్నాడు. 20 నిమిషాల్లో ఆ క్యాబ్‌ దిగిపోయి మరొకటి బుక్‌ చేసుకున్నాను. కానీ ఉబర్‌ మాత్రం నా నుంచి 6 గంటల ఫీజు వసూలు చేసింది. ప్రయాణికుల భద్రతను మాత్రం గాలికొదిలేసింది. కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే వారి పని.. ఇదెంత అసహ్యకరం అని ట్వీట్‌ చేసింది. దీంతో చాలామంది నెటిజన్లు తమకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటూ వారి అనుభవాలు షేర్‌ చేసుకున్నారు.

సినిమా
మీరా చోప్రా విషయానికి వస్తే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వాన, గ్రీకువీరుడు, మారో వంటి చిత్రాల్లో నటించింది. గ్యాంగ్‌ ఆఫ్‌ ఘోస్ట్స్‌ మూవీ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ద టాటూ మర్డర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది.

 

 

చదవండి: ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే: తమన్నా

Videos

బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..!

నందమూరి బాలయ్య కోసం నారా బావయ్య నిర్వాకం

ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI

ఇజ్రాయెల్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

నయా ట్రెండ్.. పెళ్లికి ముందు అంతా చేసేసి బ్లాక్ మెయిల్

భారత్ సెమీస్ చేరాలంటే..? 11 ఓవర్లలో ఎంత ఛేజ్ చేయాలంటే..!

సుబ్బారెడ్డి భార్యను మేం తీసుకొస్తాం చంద్రబాబు, లోకేష్, బిఆర్ నాయుడు.. మీ భార్యలను తీసుకురండి

కూటమి సర్కార్ కు షాకిచ్చిన సోము వీర్రాజు

యూట్యూబర్‌ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు

Amalapuram: రెస్టారెంట్లో అమలాపురం కుళ్ళిన చికెన్‌తో బిర్యానీ

Photos

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

నందిపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)

+5

Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)