Breaking News

Vaazhai In OTT: ఆ హిట్ డైరెక్టర్‌ మూవీ.. నేరుగా ఓటీటీకేనా!

Published on Tue, 01/02/2024 - 10:51

మామ‌న్న‌న్ మూవీతో హిట్‌ అందుకు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వాజై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కలైయరాసన్, నిఖిలా విమల్, ప్రియాంక, దివ్య, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీ రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. మూడు సూపర్ హిట్ చిత్రాల తర్వాత మారి సెల్వరాజ్‌ తెరకెక్కించిన నాలుగో చిత్రం వాజై ఓటీటీలో రిలీజ్‌ చేయడంపై ఫ్యాన్స్‌కు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మామన్నన్ కంటే ముందే వచ్చిన పెరియారుమ్ పెరుమాల్, క‌ర్ణ‌న్‌ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. స‌మాజంలో అణ‌గారిన వ‌ర్గాలు ఎదుర్కొంటున్న వివ‌క్ష‌లను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకున్నారు మారి సెల్వరాజ్. దీంతో వాజై మూవీని కూడా  థియేటర్లలోనే రిలీజ్ చేస్తారని కోలీవుడ్ ఫ్యాన్స్ భావించారు. అదే తరహాలోనే వాజై చిత్రాన్ని కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

అసలు కారణమిదేనా?

అయితే ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నవ్వి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అందువల్లే ఈ మూవీని థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌ను కూడా త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తామ‌ని ఇటీవలే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ప్ర‌క‌టించింది. కాగా.. ఈ సినిమాకు ద‌స‌రా ఫేమ్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. 


 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)