Breaking News

సాయిపల్లవి సినిమా.. క్లైమాక్స్‌ మార్చేసిన ఆమిర్‌ ఖాన్‌

Published on Thu, 04/09/2026 - 11:05

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయిపల్లవి ఏక్‌ దిన్‌ (ఒక రోజు) సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కుమారుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్నాడు. సునీల్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆమిర్‌ ఖాన్‌, మన్సూర్‌ ఖాన్‌, అపర్ణ పురోహిత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

పట్టు కోల్పోలేదు
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఆమిర్‌ బంధువు, దర్శకనిర్మాత మన్సూర్‌ ఖాన్‌. ఆయన మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో నేను పెద్దగా సినిమాలు చూడటం లేదు. కానీ నాలో కళాత్మక దృక్పథం మాత్రం చెక్కు చెదరలేదు. కొన్ని సన్నివేశాలను మరీ ఓవర్‌గా చూపించడం కంటే కాస్త సున్నితంగా డీల్‌ చేయడమే మంచిదని భావిస్తాను. అలా కథపై నాకింకా మంచి పట్టుంది. అందుకే ఏదైనా అవసరమైతే సాయం చేస్తానని చిత్రయూనిట్‌కు మాటిచ్చాను. కథలో ఏదైనా మార్పు చేయాలి అనిపిస్తే ఓపెన్‌గా చెప్తానన్నాను.

మేము ఒప్పుకోలేదు
ఉదాహరణకు.. ఏక్‌ దిన్‌ మూవీ చివర్లోని ఓ పాటను జపాన్‌లో చిత్రీకరించాం. ఆ పాట షూటింగ్‌ క్లిప్స్‌ చూసిన ఆమిర్‌.. అమ్మాయి ఈపాటికే ఓ పాటలో ఏడ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ సాంగ్‌లో ఏడవడం దేనికన్నాడు. అబ్బాయితో ప్రేమలో పడటం గురించి ఒక పాట పాడితే బాగుంటుందన్నాడు. అయితే దర్శకుడు ఏం ఆలోచిస్తున్నాడో నాకు బాగా తెలుసు, కాబట్టి డైరెక్టర్‌కే సపోర్ట్‌ చేశాను. అప్పుడు ఆమిర్‌ సరదాగా.. ఏదైనా తేడా జరిగిందంటే మిమ్మల్ని జపాన్‌కు పంపించేస్తాను అన్నాడు.

క్లైమాక్స్‌ మార్చేసిన ఆమిర్‌
తర్వాత పూర్తి సాంగ్‌ చూసినప్పుడు మాత్రం మేము చేసింది సరైనదేనని మాతో ఏకీభవించాడు. అలాగే క్లైమాక్స్‌ సీన్‌పైనా కొన్ని అభ్యంతరాలు చెప్పాడు. దాన్ని కాస్త మార్చి రాశాడు. అది చూశాక ఆమిర్‌ చెప్పేది కరెక్టే అనిపించి మేము అదే ఫాలో అయిపోయాం. ఇలా సినిమా కోసం అందరి కలిసి పని చేశాం' అని తెలిపాడు. ఏక్‌ దిన్‌ మూవీ మే 1న విడుదల కానుంది. ఇకపోతే మన్సూర్‌ ఖాన్‌ గతంలో ఆమిర్‌ఖాన్‌ హీరోగా 'ఖయామత్‌ సే ఖయామత్‌ టక్‌', 'జో జీతా వొహి సికందర్‌' సినిమాలు తెరకెక్కించాడు. మన్సూర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచాయి.

చదవండి: నీకోసం పిలిచా, అరిచా, ఏడ్చా.. అయినా నువ్వు రాలేదు: నటుడి భావోద్వేగం

Videos

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?

కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

కాకాణిపై మరో అక్రమ కేసు

నయిమ్ ఖాసిమ్ ను చంపేశాం ఇజ్రాయెల్ కీలక ప్రకటన

నీది ఒక బతుకేనా... ABN రాధాకృష్ణకు కాకాణి మాస్ వార్నింగ్

Photos

+5

Allu Arjun Birthday Celebrations : సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)