Breaking News

రాత్రిపూట మనోజ్‌ ఫోన్‌ కాల్‌.. ఎంతో ఏడ్చా: బాలీవుడ్‌ నటుడు

Published on Mon, 12/08/2025 - 14:21

సినిమా లేదా సిరీస్‌ బాగుందంటే జనం ఆటోమేటిక్‌గా చూస్తారు. సెలబ్రిటీలు కూడా ఆయా ప్రాజెక్ట్‌ను మెచ్చుకుంటూ పోస్టులు పెడతారు. అయితే బాలీవుడ్‌లో ఇలా మెచ్చుకునే ప్రోగ్రామ్స్‌ ఉండవంటున్నాడు నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్‌ సిరీస్‌ 'ద ఫ్యామిలీ మ్యాన్‌'. ఈ సిరీస్‌ మూడో సీజన్‌ ఇటీవలే రిలీజవగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

జీవితంలో మర్చిపోలేను
తాజాగా ఫ్యామిలీ మ్యాన్‌ టీమ్‌ అంతా ఓ చిట్‌చాట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా జైదీప్‌ అహ్లావత్‌ మాట్లాడుతూ.. పాతాళ్‌ లోక్‌ సీజన్‌ 1 రిలీజైనప్పుడు మనోజ్‌ రాత్రిపూట నాకు ఫోన్‌ చేసి పావుగంటపైనే మాట్లాడాడు. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఫోన్‌కాల్‌ తర్వాత నేనెంతో ఏడ్చాను అని చెప్పాడు. ఇంతలో మనోజ్‌ మాట్లాడుతూ.. ఆ రోజు ఫోన్‌లో ఏం చెప్పానంటే అతడు ఒక ఇన్‌స్టిట్యూషన్‌ ఓపెన్‌ చేస్తే అందులో తాను ఒక విద్యార్థిగా చేరతానన్నాను అని గుర్తు చేసుకున్నాడు. 

అభద్రతా భావం ఎక్కువ
ఆ వెంటనే ఇండస్ట్రీలో ఇలా ఒకరినొకరు పొగడటం చాలా తక్కువ అని చెప్పాడు. ఏ సెలబ్రిటీ కూడా ఫోన్‌ చేసి నీ యాక్టింగ్‌ బాగుంది, నీ ప్రాజెక్ట్‌ బాగుంది అని చెప్పరు. ఎందుకంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ. ఇప్పటికీ నేను మంచి పాత్రల కోసం ఫోన్‌ చేసి అడుగుతుంటాను. కష్టజీవిగా ఉండటానికే నేను ఇష్టపడతాను అని మనోజ్‌(Manoj Bajpayee) చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్‌ బాజ్‌పాయ్‌, జైదీప్‌ అహ్లావత్‌ (Jaideep Ahlawat).. గతంలో గ్యాంగ్‌ ఆఫ్‌ వాసేపూర్‌ అనే వెబ్‌ సిరీస్‌లో, చిట్టగ్యాంగ్‌ మూవీలో నటించారు.

చదవండి: చిన్న వయసులో చాలా చూశా.. ఏడ్చేసిన కృతీ శెట్టి

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు