Breaking News

ఓటీటీలో 'మణికంఠన్' హిట్‌ సినిమా తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌

Published on Tue, 03/04/2025 - 07:59

రాజేశ్వరన్‌ కాళిసామి దర్శకత్వంలో మణికంఠన్, శాన్వీ మేఘన జంటగా నటించిన ‘కుడుంబస్తన్‌’ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కోలీవుడ్‌లో  ఆర్జే నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్, సెకండ్ హీరోగా మణికంఠన్ తన జర్నీ ప్రారంభించాడు. అయితే, జై భీమ్ సినిమాలో చేసిన చిన్న పాత్రే తనను హీరోగా నిలబెట్టింది.  2023లో  రొమాంటిక్ కామెడీ మూవీ 'గుడ్ నైట్‌'తో హీరోగా ఫస్ట్ హిట్ మణికందన్‌ అందుకున్నాడు. ఆ తర్వాత లవర్‌ సినిమాతో మరో విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో తను నటించిన 'కుడుంబస్తన్' విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అలా హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టిన హీరోగా మణికందన్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో తెలుగు వర్షన్‌ విడుదల కానుంది.

కుడుంబస్తన్ సినిమా కోలీవుడ్‌లో భారీ విజయం దక్కించుకోవడంతో తెలుగు అభిమానులు కూడా ఈ సినిమా కోసం  ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ఈ చిత్రం విడుదలపై అధికారికంగా ప్రకటన చేసింది. మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‍కు రానుందని జీ5 పేర్కొంది. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్‍కు రానుందని తెలిపింది. థియేటర్‌లో కేవలం తమిళ వర్షన్‌ మాత్రమే విడుదలైన కుడుంబస్తన్‌ ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో రిలీజ్‌ కావడం విశేషం.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్‍డ్రాప్‌లో తెరకెక్కిన్న ఈ చిత్రానికి రాజేశ్వరన్‌ కాళిసామి దర్శకత్వం వహించారు.  జీవితంలో డబ్బు ముఖ్యం కాదని ఈ చిత్రం చాటిచెబుతుంది. చిన్న ఉద్యోగంతో కుటుంబ భారాన్ని మోస్తూ..  ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మధ్యతరగతి యువకుడి పాత్రలో మణికంఠన్   అదరగొట్టాడని చెప్పవచ్చు. కేవలం రూ. 10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు మార్చి 7న తెలుగు వర్షన్‌ను జీ5లో చూసేయండి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)