కన్నప్ప రిలీజ్‌.. శ్రీశైల ఆలయంలో మంచు విష్ణు పూజలు

Published on Wed, 06/25/2025 - 19:36

కన్నప్ప విడుదలకు ముందు మంచు విష్ణు శ్రీశైల ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరెకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు నటించారు.

తన ఆధ్యాత్మిక ప్రయాణంలోని మధుర క్షణాలను  మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శించినట్లు తెలిపారు. పన్నెండు జ్యోతిర్లింగాలు. ఒక ప్రయాణం. శాశ్వత శాంతి. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ శైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పవిత్ర దర్శనం ఇప్పుడే పూర్తి చేసుకున్నానంటూ ఫోటోలను షేర్ చేశారు.

ఈ సందర్శనతో పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలకు నా ప్రయాణం ముగింపునకు చేరుకుంది.. నా హృదయం నిండిపోయిందని.. నా ఆత్మ ధన్యమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చారు. ప్రస్తుత జీవితం సానుకూలత, కృతజ్ఞత, శాంతి తప్ప మరేమీ లేదని పోస్ట్ చేశారు. నా హృదయానికి దగ్గరగా ఉన్న చిత్రం.. ఈ రోజు నేను మోస్తున్న స్ఫూర్తిని ప్రతిబింబించే కథ.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కన్నప్ప కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. . హర హర మహాదేవ్ అంటూ పోస్ట్ చేశారు. 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)