Breaking News

మంచు విష్ణు కన్నప్ప.. అతని ఎంట్రీ మరిచిపోలేని జ్ఞాపకం!

Published on Wed, 06/18/2025 - 17:49

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు ముకేశ్ కుమార్‌ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్‌లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా మంచు విష్ణు తన కుమారుడి వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

తన కుమారుడు అవ్రామ్ కన్నప్ప మూవీతో అరంగేట్రం చేయడం సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తను సెట్‌లోకి రావడం, మాటలు చెప్పడం, ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నటించడం నా జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటని తెలిపారు. ఒక తండ్రిగా నేను ఒకప్పుడు కలలు కన్న అదే ఆకాశం కింద మన బిడ్డ ప్రకాశించడం చూస్తే అంతకు మించింది ఏదీ ఉండదు..ఇది కేవలం అరంగేట్రం కాదు. ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మీరు ఎల్లప్పుడూ నాకు ఇచ్చిన అదే ప్రేమ, ఆశీర్వాదాలతో మీరందరూ నా కుమారుడిపై కూడా చూపిస్తారని నేను ఆశిస్తున్నా.. అవ్రమ్ ప్రయాణం ప్రారంభం.. అది కన్నప్పతో మొదలు కావడం చాలా సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కాగా.. కన్నప్పలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటించారు. ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్‌ బాబు నిర్మించారు. ఈ సినిమాలో  మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు నటించారు. వీరితో పాటు అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, సప్తగిరి, ముఖేష్ రిషి, మధుబాల, ఐశ్వర్య భాస్కరన్, బ్రహ్మాజీ, దేవరాజ్, రఘు బాబు, శివ బాలాజీ కీలక పాత్రల్లో మెప్పించారు. కాగా.. ఈ సినిమాను ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. అద్భుతంగా ఉందంటూ కొనియాడారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు