కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మనోజ్‌ టార్గెట్‌గా విష్ణు కామెంట్స్!

Published on Fri, 05/30/2025 - 19:59

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కన్నప్ప హార్డ్‌ డిస్క్ మాయం కావడం టాలీవుడ్‌ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈ విషయం బయటికి రావడంతో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు కూడా నమోదు చేశారు. హార్డ్‌ డిస్క్‌ ఎవరూ మాయం చేశారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హార్డ్‌ డిస్క్ మాయంపై హీరో మంచు విష్ణు స్పందించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు.

మనోజ్‌ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని మంచు విష్ణు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే వాళ్లుగా తీసుకున్నారా? ఇంకెవరైనా వారితో చేయించారా? అన్నది త్వరలోనే తెలుస్తుందని అన్నారు.  హార్డ్‌ డిస్క్‌ బయటకు వెళ్లిన విషయమై పోలీసుల ద్వారా రిపోర్టర్‌కు తెలియడం వల్లే బయటకొచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెప్పడం తనకు ఇష్టం లేదని మంచు విష్ణు వెల్లడించారు. కలర్‌ గ్రేడింగ్‌కు సంబంధించి ముంబయిలో రెడీ అయితే.. హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు. మొదటిసారి పంపిన కాపీ సరిగా రాకపోవడంతో ఆ కంపెనీ హార్డ్‌ డ్రైవ్‌లో ఆ సీన్స్‌ను పెట్టి కొరియర్‌ చేసిందని విష్ణు అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ..' మేం రెండు అడ్రస్‌లు మెయింటెన్‌ చేస్తాం. అందులో ఆఫీస్‌ అడ్రస్‌ ఒకటి.. మరొకటి  జీఎస్టీ రిజిస్ట్రార్‌ పేరిట ఉంటుంది. ఇది ఫిల్మ్‌ నగర్‌లోని నాన్న ఇంటి అడ్రస్‌. మా ముగ్గురికి సంబంధించిన ఏదైనా ఇక్కడికే వస్తుంది. అక్కడ ఉండే మా మేనేజర్లు ఎవరిది వాళ్లకు అందజేస్తారు. దాదాపు 15 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. కానీ 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీకి కొరియర్‌ వచ్చిన సమయంలో రఘు అనే అతను అక్కడికి వచ్చాడు. ఆ ప్యాకెట్‌ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. ఇది జరిగి దాదాపు నెల రోజులైంది. నాకు తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించలేదు. కొరియర్ తీసుకున్న వాళ్లు మనోజ్‌ ఇంట్లో పనిచేస్తున్నారో? లేదో నాకు తెలియదు. ఎవరైనా చెప్తే వచ్చి తీసుకెళ్లారా? వాళ్లే స్వయంగా తీసుకున్నారో తెలియాల్సి ఉంది' అని అన్నారు. కాగా.. కన్నప్ప మూవీ జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)