పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు

Published on Fri, 06/06/2025 - 14:07

మంచు విష్ణు హీరోగా నటించి, భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనానికి గురవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అది దొరికిందా లేదా అనేది పక్కనబెడితే విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలోనే తెలుగులో రౌండ్ టేబుల్ పేరుతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కన్నప్ప బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)

కన్నప్ప సినిమాకు బడ్జెట్ ఎంతయిందని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. కచ్చితంగా మూడంకెల ఖర్చు అయిందని విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే రూ.100 కోట్లు అయిందా? రూ.200 కోట్లు అయిందా? అని మరోసారి అడగ్గా.. ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన చిత్రాల కంటే తమ 'కన్నప్ప' ఎక్కువని పేర్కొన్నడు. అలానే ఈ ఏడాదిలోనే విడుదలయ్యే పవన్ కల్యాణ్ 'ఓజీ' కంటే తమ మూవీ బడ్జెట్ ఎక్కువని క్లారిటీ ఇచ్చాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు.. తన ఆఫీస్‌కి వస్తారు? ఎందుకు ఈ గొడవ? అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన మంచు విష్ణు.. గత కొన్నేళ్లుగా ఈ మూవీపైనే ఉన్నాడు. ఇందులో మంచు విష్ణు హీరో కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ తదితర స్టార్స్ ఇందులో నటించారు. దీంతో మూవీపై కాస్తంత బజ్ ఉంది. కానీ చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజైనప్పుడు మాత్రం కాస్త గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది. కానీ తర్వాత మరో టీజర్ విడుదల చేసినప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందని చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానున్న 'కన్నప్ప'.. విష్ణు కెరీర్‌ని ఎలా మారుస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)