Breaking News

నా గుండె పగిలింది.. మంచు విష్ణు కీలక నిర్ణయం

Published on Thu, 06/12/2025 - 16:23

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్‌ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. కన్నప్ప ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ చేశారు. 

ఇండోర్‌లో ఈవెంట్‌.. 
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు(జూన్‌ 13) ఇండోర్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దానికి సంబంధించిన పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ని కూడా విడుదల చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈవెంట్‌ని క్యాన్సిల్‌ చేశారు.

నా గుండె పగిలింది.. 
విమాన ప్రమాదంపై మంచు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘ప్రమాదం గురించి తెలియగానే నా గుండె పగిలిపోయింది. చాలా బాధగా ఉంది. కన్నప్ప ట్రైలర్‌ రిలీజ్‌ని ఒకరోజు వాయిదా వేస్తున్నాం. అలాగే ఇండోర్‌లో రేపు జరగాల్సిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని క్యాన్సిల్‌ చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని మంచు విష్ణు ట్వీట్‌ చేశాడు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)