Breaking News

మంచు విష్ణు డేర్‌.. రూ. 100 కోట్ల పెట్టుబడితో బిగ్‌ ప్లాన్‌

Published on Fri, 08/22/2025 - 10:38

'కన్నప్ప' (Kannappa) సినిమాను నిర్మించడం కోసం మంచు విష్ణు పెద్ద సాహసమే చేశారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఏకంగా ఆయన రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది.  ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్‌ సాధించలేకపోయింది. ఈ క్రమంలో మంచు విష్ణు మరో అడుగు ముందుకువేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఒక ప్రాజెక్ట్‌ కోసం ఆయన ఏకంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

కన్నప్ప విజయం తర్వాత నటుడు, నిర్మాత విష్ణు మంచు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు. అతను మైక్రోడ్రామాలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని ఇండస్ట్రీ వర్గలు చెబుతున్నాయి. విష్ణు తన సొంత డబ్బుతో పాటు కొందరి భాగస్వామ్యంతో వినోద రంగంలో సంచలనానికి తెరలేపనున్నారు. ఈ వార్త టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతుంది.

మైక్రోడ్రామాలు అంటే ఏమిటి?
మైక్రోడ్రామాలు అంటే చిన్న పరిమాణంలో, తక్కువ వ్యవధిలో, పరిమిత పాత్రలతో, గాఢమైన భావోద్వేగాలను వ్యక్తపరచే నాటకాలు. ఇవి సాధారణంగా 1 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఉంటాయి. ఒకే సంఘటన లేదా భావన చుట్టూ తిరుగుతాయి.  సాధారణ సోషల్ మీడియా రీల్స్ మాదిరిగా కాకుండా.. ఈ కథలు ప్రొఫెషనల్ దర్శకత్వంతో పాటు అధిక-నాణ్యత నిర్మాణం ఆపై బలమైన కథ చెప్పడం వంటి అంశాలతో ఉంటాయి. 

విష్ణు కొత్త ప్రాజెక్ట్ భారతీయ వినోదంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేయనున్నాడని కొందరు అంటున్నారు. విష్ణు నిర్ణయం వల్ల నటన, రచన, దర్శకత్వం వంటి అంశాల్లో కొత్త వారికి భారీగా ఛాన్సులు దొరుకుతాయి. ఆపై కంటెంట్‌ కూడా ఎక్కువగా సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఉటుందని కొందరు చెబుతున్నారు. ఇది భారతీయ వినోద రంగంలో గేమ్-చేంజర్ అవుతుందని భావిస్తున్నారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)