Breaking News

'కన్నప్ప'కు ఇలా జరగడం బాధేస్తుంది: మంచు విష్ణు

Published on Mon, 06/30/2025 - 12:11

మంచు విష్ణు  (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్‌లో 80 శాతం సీట్లు ఫిల్‌ అవుతున్నాయి. ఆపై తమిళనాడులో కూడా మంచి టాక్‌తో రన్‌ అవుతుంది. తెలుగులో కూడా మ్యాట్నీ, సాయంత్రం షోలు హౌస్‌ఫుల్‌ అయిపోతున్నాయి. అయితే, తాజాగా మంచు విష్ణు తాజాగా సోషల్‌మీడియాలో విజ్ఞప్తి చేస్తూ పోస్ట్‌ పెట్టారు. కన్నప్ప చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు ఆవేదన చెందారు.  ఎంతో కష్టపడి సినిమాను నిర్మించామని, ఎవరూ పైరసీని ప్రొత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

కన్నప్ప సినిమా పైరసీకి గురైందని నటుడు మంచు విష్ణు తన ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే సుమారు 30వేలకు పైగానే అనధికారిక పైరసీ లింక్‌లను తమ టీమ్‌ తొలగించిందని  ఆయన పేర్కొన్నారు. పైరసీ అంటే మరొకరి శ్రమను దోచుకోవడమే..  ఇలాంటి చర్య దొంగతనంతో సమానం అవుతుందన్నారు. ఈ విషయంలో చాలా బాధగా ఉందని విష్ణు ఆవేదన చెందారు. ' మన ఇంట్లో పిల్లలకు మనం దొంగతనం చేయమని మనం నేర్పించం. ఇలా ఒక సినిమాను పైరసీలో చూడడం కూడా దొంగతనంతో సమానమే అవుతుంది. దయచేసి ఇలాంటి వాటిని అరికట్టండి. మా ‘కన్నప్ప’ సినిమాను ఆదరించండి.' అంటూ విష్ణు కోరారు.

కన్నప్ప సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 58 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ షో డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఈ మూవీలో ప్రభాస్‌ పాత్రతో పాటు మంచు విష్ణు నటన అద్భుతంగా ఉందంటూ టాక్‌ బయటకు రావడంతో టికెట్లు బాగానే తెగుతున్నాయి.  బుక్‌మైషోలో ప్రతిరోజు సుమారు ఒక లక్షకు పైగానే టికెట్లు సేల్‌ అవుతున్నాయి.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)