పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!
Breaking News
దుబాయ్‌లో మంచు విష్ణు.. యుద్ధంపై మనోజ్ ట్వీట్
Published on Sun, 03/01/2026 - 11:03
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. యుద్ధం అనేది మానవత్వాన్ని ఎప్పటికీ చూపదని అన్నారు. ఈ దాడుల్లో ఎంతోమంది అమాయకుల జీవితాలు నాశమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఎవరూ కూడా సరిదిద్దలేరని పోస్ట్ చేశారు. ఇలాంటి హింసాత్మక పరిస్థితుల్లో దుబాయ్‌లో చిక్కుకుపోయిన అమాయక ప్రజలం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంచు మనోజ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రపంచమంతా శాంతించాలని కోరుకుంటున్నట్లు ఫోటోను షేర్ చేశారు.
కాగా.. ఇరాన్‌పై దాడి తర్వాత దుబాయ్ మిస్సైల్స్ వర్షం కురుస్తోంది. ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్ మిస్సైల్స్‌తో దుబాయ్‌పై దాడులు మొదలెట్టింది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో పలువురు ప్రముఖులు చిక్కుకుపోయారు. మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు సైతం దుబాయ్‌లో ఉన్నానని మిస్సైల్స్ పడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సైతం దుబాయ్‌లో ఉన్నారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఆడేందుకు వెళ్లి ఆక్కడే చిక్కుకున్నారు.
War has never elevated our humanity.
When innocent lives suffer and fear replaces normalcy, no justification can make it right.
Praying for the safety of innocent people in Dubai and everywhere affected by violence.#WorldWar3#Peace #humanity#Dubai #dubaiattack pic.twitter.com/nCBfkptaSy— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 1, 2026
Tags : 1