Breaking News

Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. మనోజ్‌

Published on Fri, 06/27/2025 - 13:15

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప (Kannappa Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పాజిటివ్‌ స్పందన లభిస్తోంది. శుక్రవారం (జూన్‌ 27న) కన్నప్ప చిత్రాన్ని విష్ణు సోదరుడు, హీరో మంచు మనోజ్‌ ప్రసాద్‌ ఐమాక్స్‌లో వీక్షించాడు. ఈ సందర్భంగా అతడు సినిమా బాగుందని మెచ్చుకున్నాడు. మనోజ్‌ మాట్లాడుతూ.. కన్నప్ప మూవీ చూశాను. చాలా చాలా బాగుంది. ప్రభాస్‌ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్తుంది. క్లైమాక్స్‌లో (విష్ణు) ఇంత గొప్ప పర్ఫామెన్స్‌ ఇస్తారని కలలో కూడా అనుకోలేదు. 

వెయ్యి రెట్లు బాగుంది
అందరూ చాలా అద్భుతంగా చేశారు. నేను అనుకున్నదానికంటే వెయ్యి రెట్లు బాగుంది. చిత్రయూనిట్‌ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలని, మీరు పెట్టిన డబ్బు వెయ్యింతలు తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. సినిమా ప్రారంభంలో ఐదు నిమిషాలు మిస్సయ్యాను. దానికోసం కన్నప్ప సినిమాను మరోసారి చూస్తాను అని మనోజ్‌ చెప్పుకొచ్చాడు.

ప్రత్యేకంగా చెప్పాలా?
కానీ అన్న పేరును మాత్రం ప్రస్తావించలేదు. మరో వీడియోలో మాత్రం 'చివరి 20 నిమిషాలైతే అదిరిపోయింది. అన్న (విష్ణు) కూడా ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు. నాన్న (మోహన్‌బాబు) యాక్టింగ్‌ గరించి ప్రత్యేకంగా చెప్పాలా? అదరగొట్టాడు. సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. 

కన్నప్ప
కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. మహాభారతం సీరియల్‌ ఫేం ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించాడు. మోహన్‌బాబు, అక్షయ్‌ కుమార్‌, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రలు పోషించారు. 2023లో షూటింగ్‌ ప్రారంభించారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ నిర్మితమైంది. ప్రభాస్‌, మోహన్‌లాల్‌ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఈ సినిమా చేశారు.

చదవండి: సినిమాటోగ్రాఫర్‌ రసూల్‌ భార్య ఎవరో తెలుసా? ఆ టాలీవుడ్‌ నటి

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)