Breaking News

సక్సెస్‌ చూసి 12 ఏళ్లు.. నా ఫ్యామిలీని నిలబెట్టారు: మనోజ్‌ ఎమోషనల్‌

Published on Sat, 09/13/2025 - 16:11

విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన మిరాయ్‌ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. థియేటర్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. సెప్టెంబర్‌ 12న రిలీజైన ఈ మూవీ తొలి రోజు రూ.27.20 కోట్లు రాబట్టిందని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో మంచు మనోజ్‌ విలన్‌గా నటించాడు. శనివారం (సెప్టెంబర్‌ 13) ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. 

రుణపడి ఉంటా..
ఇలాంటి సక్సెస్‌ మీట్‌లో పాల్గొని చాలాకాలమైందంటూ మనోజ్‌ (Manchu Manoj) భావోద్వేగానికి లోనయ్యాడు. సక్సెస్‌ వేదికపై నిలబడ్డందుకు సంతోషంగా ఉంది. దాదాపు 10-12 ఏళ్ల తర్వాత నా ఫోన్‌ మోగుతోంది. అందరూ సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. కానీ, నాకు చాలాకాలమైంది. నిన్నటినుంచి అందరూ ఫోన్లు చేసి విషెస్‌ చెప్తుంటే అంతా కలలాగే ఉంది. దర్శకుడు కార్తీక్‌ ఏం ఆలోచించుకుని కథ రాసుకున్నారో కానీ నాకోసం ఓ పాత్ర రాసుకుని అడిగారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. 

కమ్‌బ్యాక్‌ ఎప్పుడని అడిగేవారు
ఈ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అని కార్తీక్‌ నాకు చెబుతూ ఉండేవాడు. ఆ మాట చాలనుకున్నాను. ఎప్పుడూ ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతూ ఉండేవాడిని. అప్పుడు సోషల్‌ మీడియాలో.. అన్నా, కమ్‌బ్యాక్‌ ఎప్పుడు? సినిమా చేయు, నీకు హిట్టు పడాలి, కమ్‌బ్యాక్‌ ఇవ్వు అని అడుగుతూ ఉండేవారు. వస్తున్నాను తమ్ముడు, ‍త్వరలోనే చేస్తాను అనేవాడిని. బయటకు ధైర్యంగా మాట్లాడినా లోపల మాత్రం ఏదో తెలియని భయం ఉండేది. చాలా సినిమాలు దగ్గరివరకు వచ్చి వెళ్లిపోయాయి. ఒకటనుకుంటే ఇంకోటి జరిగేది. 

నా కుటుంబాన్ని నిలబెట్టారు
ఇలాంటి సమయంలో డైరెక్టర్‌ కార్తీక్‌, నిర్మాత విశ్వప్రసాద్‌ నన్ను నమ్మారు. కార్తీక్‌లాంటి దర్శకుడు, టెక్నీషియన్‌ను నా జీవితంలో చూడలేదు. మిమ్మల్ని దగ్గరినుంచి చూసినందుకు సంతోషంగా ఉంది. మీరు నన్నొక్కడినే కాదు, నా కుటుంబాన్ని సైతం నిలబెట్టారు. ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు కానీ నాలో ఓ భయం ఉండేది. నేను పెరిగినట్లుగా నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా? వాళ్లను బాగా చూసుకోగలుగుతానా? అని రోజూ భయపడేవాడిని. ఆ భయాన్ని మీరు చంపేశారు. నేను గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరి పాదాలకు నా వందనం అని మనోజ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

చదవండి: డేంజర్‌ జోన్‌లో ఉన్నది వీళ్లే.. లక్స్‌ పాపపై ఎలిమినేషన్‌ వేటు?

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు