Breaking News

అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష‍్మీ

Published on Sun, 06/08/2025 - 20:00

మంచు అనే పేరు చెప్పగానే ప్రస్తుతానికి 'కన్నప్ప' సినిమా లేదంటే వాళ్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు గుర్తొస్తాయి. ఇప్పటికైతే ఏం జరగట్లేదు. మంచు విష్ణు.. తను హీరోగా నటించి భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'కన్నప్ప'ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. మరోవైపు మనోజ్ కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. ఈ గొడవల్లో ఎక్కడా కనిపించని మంచు లక్ష‍్మీ.. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో ప్రత్యక్షమైంది. తాను కన్నప్ప చిత్రంలో నటించకపోవడానికి గల కారణాన్ని బయటపెట్టింది.

'నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి. నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరు కనిపించరు(సరదాగా). ఇందులో నేను చేయగలిగే పాత్ర లేకపోవడంతోనే విష్ణు నాకు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ నేను చేయగలిగే పాత్ర ఉంటే ఇచ్చి ఉండేవాడేమో. మేమంతా కలిసి అన్ని చిత్రాల్లో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది' అని మంచు లక్ష‍్మీ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)

మీ సోదరులకి.. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. సినిమాల్లో అవకాశం ఇవ్వకపోవటానికి, సపోర్ట్ చేయకపోవడానికి సంబంధం లేదు. నా మద్దతు వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది అని సమాధానమిచ్చింది. గత కొన్ని నెలల నుంచి మంచు కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పెద్దగా మాట్లాడని మంచు లక్ష‍్మీ.. మంచు మనోజ్‌కి మాత్రం అండగా ఉంది.

కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన మంచు లక్ష‍్మీ.. ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. బాలీవుడ్ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 'ద ట్రైటర్స్' అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు సిద్ధమైంది. తాజాగా హైదరాబాద్‪‌లో కనిపించిన ఈమె.. మీడియాతో మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకుంది. ఈ ఈవెంట్‌లోనే స్పందిస్తూ 'కన్నప్ప'లో నటించకపోవడానికి కారణం కూడా బయటపెట్టింది.

(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!)

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)