కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
Breaking News
'మన శంకరవరప్రసాద్ గారు' ఫస్ట్ డే.. భారీ కలెక్షన్స్
Published on Tue, 01/13/2026 - 10:51
చిరంజీవి- అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో చిరంజీవితో పాటు వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడ్కేర్ తదితరులు నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. భోళా శంకర్ వంటి డిజాస్టర్ తర్వాత చిరుకు భారీ హిట్ పడిందని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

'మన శంకరవరప్రసాద్ గారు' ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 84కోట్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే రెండో అతిపెద్ద ఓపెనింగ్ చిత్రంగా 'మన శంకరవరప్రసాద్ గారు' నిలబడింది. 'సైరా నరసింహా రెడ్డి' చిత్రానికి మొదటిరోజు రూ. 85 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఖైదీ నంబర్ 150'కి (రూ. 51 కోట్లు), వాల్తేరు వీరయ్య (రూ. 49.10 కోట్లు), గాడ్ ఫాదర్ (రూ. 32.70 కోట్లు), ఆచార్య ( రూ. 52 కోట్లు), భోళా శంకర్ (రూ. 28 కోట్లు) వచ్చాయి.
మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు 💥💥💥
₹84 CRORES+ WORLDWIDE GROSS for#ManaShankaraVaraPrasadGaru (Premieres + Day 1) ❤️🔥❤️🔥❤️🔥
ALL TIME RECORD OPENINGS EVERYWHERE 🔥🔥🔥#MegaBlockbusterMSG
Megastar @KChiruTweets
Victory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/qId5atqw8T— Shine Screens (@Shine_Screens) January 13, 2026
Tags : 1