Breaking News

మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన

Published on Fri, 01/23/2026 - 12:26

మమ్ముట్టి 'పాదయాత్ర' చేసేందుకు రెడీ అయిపోయారు. స్వతహాగా ఈయన మలయాళ హీరోనే అయినప్పటికీ తెలుగులోనూ బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల రూపంలో అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'పాదయాత్ర' గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా గతంలో తీసిన 'యాత్ర' సినిమాలో మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించారు. వైఎస్ఆర్‌గా అద్భుతమైన యాక్టింగ్ చేసి ఆకట్టుకున్నారు. రీసెంట్ టైంలో అయితే తన నిర్మాణంలోనే కన్నూర్ స్క్వాడ్, కలంకావళ్ అనే చిత్రాలతో వావ్ అనిపించారు. కలంకావళ్ చిత్రంలో అయితే మహిళల్ని చంపే సైకో పాత్రలో అలరించారు. ఇప్పుడు తన నిర్మాణంలోనే 'పాదయాత్ర' అనే మూవీని ప్రకటించారు.

(ఇదీ చదవండి: మమ్ముట్టి సైకో కిల్లర్‌ 'కలాం కావల్‌' మూవీ రివ్యూ..)

సాధారణంగా 'పాదయాత్ర' అంటే రాజకీయ పరిభాషలోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరి మమ్ముట్టి ఇప్పుడు తీయబోయేది కూడా పొలిటికల్ సినిమాయేనా? లేదంటే ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్‌ అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అదూర్ గోపాలకృష్ణన్ దర్శకుడు. 84 ఏళ్ల ఈ డైరెక్టర్‌తో మమ్ముట్టి.. 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయనుండటం విశేషం. గతంలో వీళ్లిద్దరూ 'విధేయన్' అనే మూవీ చేశారు. దానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది.

అదూర్ గోపాలకృష్ణన్ విషయానికొస్తే.. 1965 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎక్కువగా డాక్యుమెంటరీలు తీశారు. కొన్ని ఫీచర్ ఫిల్మ్స్ కూడా తెరకెక్కించారు. 1972లో ఈయన తీసిన 'స్వయంవరం' చిత్రానికి ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. తర్వాత కాలంలోనూ 'కొడియట్టం', విధేయన్, మథిలుకళ్, అనంతరం, ముఖాముఖం, ఎలిపత్యం, కథాపురుషన్, నిళల్ కుతు, నాళ్ పెన్నుంగళ్ తదితర మూవీస్‌తోనూ ఈయన జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. చివరగా 2016లో ఓ సినిమా చేసిన ఈయన.. ఇన్నాళ్లకు మమ్ముట్టి కలిసి పనిచేయబోతుండటం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఈసారి 'పాదయాత్ర'తో మరో జాతీయ అవార్డ్ కొడతారేమో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)