Breaking News

మమ్ముట్టి అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లు

Published on Mon, 09/07/2026 - 13:06

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మేళా’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కాగా..  ధనుష్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ఓమ్’ నుంచి కూడా స్పెషల్ అప్‌డేట్ బయటికొచ్చింది. దీంతో మమ్ముట్టి అభిమానులు సోషల్‌ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదీ చదవండి: ‘హనుమాన్‌ అంశ్‌’ కి తగ్గని క్రేజ్‌.. పంచెకట్టుతో విద్యార్థులు

సినిమా విషయానికి వస్తే..
మమ్ముట్టి, దర్శకుడు నితీష్‌ సహదేవ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మేళా’. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ బ్యానర్‌లో వస్తున్న తొమ్మిదో చిత్రమిది. ఈ చిత్రానికి అనురాజ్‌ ఓ.బి., నితీష్‌ సహదేవ్‌ కలిసి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. నితీశ్‌ సహదేవ్‌ గతంలో ‘ఫ్యామిలీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిమ్షీ ఖలీద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జులైలోనే ప్రారంభమైనట్లు సమాచారం.
ఓమ్‌: ధనుష్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి,  శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. 
తెలుగులో..
మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే 2019లో విడుదలైన యాత్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముమ్ముట్టి. మంచి విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా యాత్ర2ను 2024 ఫిబ్రవరి 8న విడుదల చేశారు. ఈ సినిమాలోనూ ప్రత్యేక పాత్రలో ముమ్ముట్టి కనిపించారు. ( స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?)
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)