విజయ్‌ చివరి సినిమాలో మలయాళ బ్యూటీకి ఛాన్స్‌

Published on Tue, 08/06/2024 - 11:08

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌- వెంకట్‌ప్రభు కాంబినేషన్‌లో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం గోట్‌. ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని సెప్టెంబర్‌ 5న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విజయ్‌ తన 69వ చిత్రంపై దృష్టి పెడుతున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్‌కి ఇదే చివరి చిత్రం అనే ప్రచారం చాలాకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

దీంతో ఈ చిత్రం తన రాజకీయ జీవితానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఆయన భావించినట్లు సమాచారం. కాగా దర్శకుడు హెచ్‌.వినోద్‌ నటుడు కమలహాసన్‌ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అందుకు కథను కూడా తయారు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం డ్రాప్‌ అయ్యిందని తెలిసింది. అయితే అదే కథతో విజయ్‌ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి హెచ్‌.వినోద్‌ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కథ సమకాలీన రాజకీయలు ఇతి వృత్తంగా ఉంటుందని, అందుకే విజయ్‌ ఈ చిత్రం చేయడానికి అంగీకరించినట్లు టాక్‌. ఏదేమైనా ఈ చిత్రానికి సంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలను దర్శకుడు హెచ్‌.వినోద్‌ ప్రారంభించారనీ నవంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం.

ఈ చిత్రంలో లుక్‌ కోసం నటుడు విజయ్‌తో ఇటీవల ఫొటో సెషన్‌ చేసినట్లు తెలిసింది. దీంతో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో సంచలన నటి సమంత ప్రధాన పాత్రను పోషించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మలయాళ కుట్టి మమితా బైజూ ఇందులో విజయ్‌తో కలిసి నటించనున్నారనే టాక్‌ వైరల్‌ అవుతోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కేరళ కుట్టి ప్రేమలు అనే మలయాళ చిత్రం ద్వారా బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. కాగా విజయ్‌ సరసన నటించే అవకాశం వచ్చిందంటే నిజంగా ఆమె లక్కే అని చెప్పాలి. కాగా కేవీఎన్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని, సత్యన్‌ సూర్యన్‌ ఛాయాగ్రహణం అందించనున్నారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)