Breaking News

ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న నటి గాయత్రి

Published on Tue, 01/10/2023 - 08:47

తమిళ సినిమా: అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటిగా గాయత్రి అవార్డును గెలుచుకున్నారు. గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న నటి గాయత్రి. ఇటీవల కమలహాసన్‌ కథానాయకుడిగా నటించి నిర్మించిన సూపర్‌ హిట్‌ చిత్రం విక్రమ్‌లోనూ నటించారు. తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె మలయాళం చిత్ర పరిశ్రమలోను ప్రముఖ నటిగా రాణిస్తున్నారు.

కాగా ఇటీవల నటుడు విజయ్‌ సేతుపతికి జంటగా నటించిన మామనిదన్‌ ,ఇత్రం గత ఏడాది జూన్‌లో విడుదలై మంచి చిత్రంగా సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. అనంతరం ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందింది. శీనూ రామసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులను గెలుచుకుంది.

ఇటీవల చెన్నైలో జరిగిన చెన్నై అంతర్జాతీయ చతురత్వాల్లో కూడా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది. తాజాగా జైపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మామనిదన్, ఇరైవిన్‌ విశాల్, గార్గీ, విత్రన్‌ త్రాలను ప్రదర్శించారు. కాగా మామనిదన్‌ చిత్రంలో విజయ్‌ సేతుపతికి భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన గాయత్రి ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఆమెను చిత్ర దర్శకుడు శీను రామసామితో పాటు పలువురు సినీ ప్రముఖులు అభినందించారు.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)