Breaking News

Guntur Kaaram: అభిమానులతో కలిసి సినిమా చూసిన మహేశ్‌

Published on Fri, 01/12/2024 - 15:43

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు. అలాంటిది ఆయన మాస్‌ మసాలా సినిమాతో వస్తున్నాడంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం నేడే(జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేరుకు తగ్గట్లే సినిమాలో ఘాటు ఎక్కువే ఉందనుకున్నారు అభిమానులు. సోషల్‌ మీడియాలో టాక్‌ చూస్తుంటే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే కనిపిస్తోంది. 

మిక్స్‌డ్‌ టాక్‌..
మహేశ్‌ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు కానీ కొన్నిచోట్ల సీన్లు, డైలాగులు పేలవంగా ఉండటం, కథ కూడా బలహీనంగా ఉండటంతో సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్‌ సహా ఫైటింగ్‌ సీన్స్‌ను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్‌ తన ఫ్యామిలీతో కలిసి శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో గుంటూరు కారం సినిమా చూశాడు. భార్య నమ్రత, తనయుడు గౌతమ్‌, కూతురు సితార అతడి వెంట ఉన్నారు.

థియేటర్‌లో మహేశ్‌బాబు
అలాగే దర్శకుడు త్రివిక్రమ్‌, రచయిత వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు.. మహేశ్‌తో కలిసి థియేటర్లో సినిమా వీక్షించారు. థియేటర్‌లో అభిమాన హీరో కనిపించడంతో ఫ్యాన్స్‌ సంతోషంతో కేకలు పెట్టారు. అయితే మహేశ్‌, త్రివిక్రమ్‌, వంశీ ముఖాల్లో చిరునవ్వే కనిపించడం లేదని అభిమానులు ఫీలవుతున్నారు. మహేశ్‌ను అలా దిగాలుగా చూడలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: గుంటూరు కారం ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే! సినిమా సత్తాను బట్టి..

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)