మహేశ్ 'వారణాసి'.. సమస్య పరిష్కారమైందా?

Published on Sat, 11/29/2025 - 21:23

రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న సినిమా 'వారణాసి'. రెండు వారాల క్రితం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరీ మూవీ విశేషాలని పంచుకున్నారు. దాదాపు నాలుగు నిమిషాల వీడియోని కూడా రిలీజ్ చేశారు. తద్వారా మూవీ ఎలా ఉండబోతుందనేది అందరికీ ఓ అంచనా వచ్చేలా చేశారు. అయితే టైటిల్ విషయంలో సమస్య రావొచ్చని చాలామంది అనుకున్నారు. అదే జరిగింది. ఇప్పుడు సదరు సమస్య పరిష్కారం కూడా అయినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'స్పిరిట్' సినిమా.. డైరెక్టర్ సందీప్ షాకింగ్ డెసిషన్!)

ప్రకటించడానికి ముందే రాజమౌళి-మహేశ్ చిత్రానికి 'వారణాసి' టైటిల్ పెట్టబోతున్నారని రూమర్స్ వచ్చాయి. తర్వాత అదే నిజమైంది. కానీ ఇది లాంచ్ కావడానికి కొన్నిరోజుల ముందు మరో తెలుగు చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్ పెట్టారు. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇదో చిన్న సినిమా. నటీనటులు గానీ దర్శకుడు గానీ ఎవరో కూడా తెలియదు. అయితే వీళ్ల వల్ల రాజమౌళి చిత్రానికి సమస్య ఉండొచ్చని అనుకున్నారు. తర్వాత కాలంలో వీళ్లు.. ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు కూడా. దీంతో రాజమౌళి ఏం చేస్తారా అని మాట్లాడుకున్నారు.

ఇప్పుడు టైటిల్ విషయంలో సమస్య పరిష్కారం అయినట్లు తెలుస్తోంది. ప్రకటించిన పేరుకి ముందు రాజమౌళి పేరు తగిలించినట్లు టాక్. అంటే ఇకపై 'రాజమౌళి వారణాసి' అని ఉండబోతుంది. కాకపోతే ఇప్పుడిప్పుడే దీని గురించి బయటపెట్టేందుకు టీమ్ ఏమంత ఆసక్తితో లేదట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సమస్య పరిష్కారం అయిపోయినట్లే. గతంలోనూ ఇలానే టైటిల్స్ విషయం ఇబ్బందులు తలెత్తాయి. అ‍ప్పుడు 'మహేశ్ ఖలేజా', 'కల్యాణ్ రామ్ కత్తి' అని హీరోల పేర్లు టైటిల్ ముందు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం దర్శకుడి పేరు ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి ఏదైనా ప్రకటన వచ్చినప్పుడు 'వారణాసి' టైటిల్ విషయంలో క్లారిటీ రావొచ్చు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

పోలీసులు కొట్టడంతోనే నా భర్త మృతి? గోపి లాకప్ డెత్ పై సంచలన నిజాలు

దేవుడా..నా దొంగతనం సక్సెస్ కావాలి

విధుల్లో ఉన్న పోలీసుపై దాడి.. గోప్యంగా విషయం?

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)