నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్

Published on Sun, 04/20/2025 - 15:33

హీరో మహేశ్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం ఒడిశాలో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఆ వెంటనే తన కుటుంబంతో కలిసి ఇటలీ ట్రిప్ వేశాడు. తాజాగా తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. ఈ క్రమంలోనే తల్లి గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: దెయ్యం సినిమాకు వసూళ్లు ఎంతొచ్చాయ్?)

మహేశ్ బాబుకు తల్లి ఇందిరా దేవి(Indira Devi) అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ 2022లో ఆమె చనిపోవడం మాత్రం మహేశ్ కి తీరనిలోటు అని చెప్పొచ్చు. తర్వాత సందర్భం వచ్చిన ప్రతిసారి ఆమెని గుర్తుచేసుకుంటూ ఉంటాడు. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 20) ఆమె పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు లవ్లీ పోస్ట్ పెట్టాడు.

మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నా అమ్మ.. హ్యాపీ బర్త్ డే అని అమ్మతో కలిసి ఉన్న ఓ ఫొటోని మహేశ్ బాబు పోస్ట్ చేశాడు. దీనికి అతడి అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు. 

(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)

తల్లినే కాదు కుటుంబానికి మహేశ్ చాలా ప్రాధాన్యమిస్తాడు. అయితే షూటింగ్ లో ఉంటాడు. లేదంటే ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపుతూ కనిపిస్తుంటాడు. అందుకే ఏడాదిలో రెండు మూడు సార్లు కూతురు సితార(Sitara Ghattamaneni), కొడుకు గౌతమ్, భార్య నమ్రతతో కలిసి మహేశ్ ట్రిప్స్ కి వెళ్తూనే ఉంటాడు.

ఇక రాజమౌళితో మహేశ్ బాబు చేస్తున్న సినిమా విషయానికొస్తే.. ‍అడవుల బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వెంచరస్ కథతో దీన్ని తీస్తున్నారు. మహేశ్ తోపాటు ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 31న గానీ లేదా అంతకుముందే మూవీ గురించి అనౌన్స్ మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇ‍ప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)