Breaking News

'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. బయటపెట్టిన రాజమౌళి

Published on Sat, 11/15/2025 - 22:05

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోని 'గ్లోబ్ ట్రాటర్'లో ప్రసారం చేశారు. విజువల్స్ అన్నీ టాప్ నాచ్ ఉండగా.. అభిమానులు దీన్ని చూసి మైమరిచిపోయారు. ఇదే అనుకుంటే.. ఈ సినిమాలో మహేశ్ బాబు శ్రీరాముడిగా నటించారని చెప్పి రాజమౌళి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 60 రోజుల పాటు రాముడి ఎపిసోడ్ చిత్రీకరించామని చెప్పారు.

(ఇదీ చదవండి: మహేశ్ బాబు 'వారణాసి'.. 2027 వేసవిలో రిలీజ్)

'తొలిరోజు ఫొటోషూట్‌లో మహేశ్ బాబుని శ్రీరాముడిగా రెడీ చేసి ఫొటోలు తీశాం. అయితే మహేశ్, కృష్ణుడి పాత్రకు బాగా సూట్ అవుతాడని అనుకున్నా. కానీ ఆ రోజు మహేశ్.. నా అంచనా తప్పు అని నిరూపించాడు. దీంతో మహేశ్ రాముడి గెటప్ ఫొటోని నా వాల్ పేపర్‌గా పెట్టుకున్నాను. కానీ ఎవరు చూసేస్తారేమో అనుకుని దాన్ని తీసేశాను. రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. మహేశ్‌ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటోషూట్ తీస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రాముడి ఎపిసోడ్‌ని 60 రోజుల పాటు తీశాం. రీసెంట్‌గానే అది పూర్తయింది. ఇందులో చాలా సబ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్.. నాకు, మహేశ్ కెరీర్‌లోనే మర్చిపోలేని సీక్వెన్స్' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: 30 నిమిషాల ఫైట్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్)

Videos

Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్

కరీంనగర్ లో దారుణం కూతురు కొడుకుపై తండ్రి దాడి..

Ranga Reddy: తమ్ముడు కులాంతర వివాహం అన్నను దారుణంగా చంపి

అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?

చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనిలో దారుణం

దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్

చంద్రబాబు క్రెడిట్ చోర్ సాక్ష్యాలు లైవ్లో బయటపెట్టిన పేర్ని కిట్టు

మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్

Eluru: గోవులను చంపే పశువధశాల భరించలేని వాసన

Photos

+5

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)