Breaking News

రీరిలీజ్‌లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. నీ వల్ల అవుద్ది సామీ!

Published on Mon, 06/02/2025 - 14:10

'ఖలేజా' సినిమా (Khaleja Movie)తో నిండా మునిగాడు నిర్మాత సింగనమల రమేశ్‌. కొమురం పులి, ఖలేజా సినిమాలతో ఏకంగా రూ.100 కోట్లు నష్టపోయానని ఆ మధ్య తన బాధను వ్యక్తం చేశాడు. మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ఖలేజా సినిమా షూటింగ్‌ జాప్యం ఒక కారణమైతే ప్రేక్షకులు దాన్ని డిజాస్టర్‌గా మల్చడం మరో కారణం. కానీ ఆ సినిమా ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తుండటం విశేషం!

అప్పుడలా.. ఇప్పుడిలా..
2010లో త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఖలేజా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. కానీ తర్వాత టీవీల్లో మాత్రం జనాలు బాగానే చూసేవారు. అసలే కొంతకాలంగా రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. బిజినెస్‌మ్యాన్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పోకిరి, ఒక్కడు.. ఇలా మహేశ్‌ సినిమాలే చాలావరకు రీరిలీజ్‌ అయ్యాయి. తాజాగా మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఖలేజాను 4కె వర్షన్‌లో రీరిలీజ్‌ చేశారు.

నీ వల్ల అవుద్ది సామి
ఇంకేముంది, మరోసారి జనం థియేటర్లకు క్యూ కట్టారు. కొత్త సినిమాలను సైతం పక్కకు నెట్టి ఖలేజా సినిమాను వీక్షిస్తున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.11.83 కోట్లు రాబట్టినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. రీరిలీజ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తెలుగు చిత్రంగా ఖలేజా నిలిచింది. ఇది చూసిన అభిమానులు.. ఈ రికార్డులన్నీ కేవలం నీ వల్లే అవుతాయి సామి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

త్వరలోనే మరో రీరిలీజ్‌
ఖలేజా సినిమాలో మహేశ్‌బాబుకు జంటగా హీరోయిన్‌ అనుష్క నటించింది. ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌, సునీల్‌, షఫీ, అలీ, సుబ్బరాజు ఇతర పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించాడు. అతడు తర్వాత త్రివిక్రమ్‌- మహేశ్‌ డైరెక్షన్‌లో వచ్చిన రెండో చిత్రమిది. ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌, ఉత్తమ గేయరచయిత విభాగంలో రెండు ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డులు అందుకుంది. ఇకపోతే మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న అతడు చిత్రాన్ని మళ్లీ రిలీజ్‌ చేయనున్నారు.

 

చదవండి: నార్మల్‌ డెలివరీ కంటే ఆపరేషన్‌ ఈజీనా? మీకేం తెలుసు?: నటి కన్నీళ్లు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)